Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తరగతి గదిలో రేప్ ప్రాక్టికల్స్... విద్యార్థులతో డెమో చేయించిన కీచక టీచర్లు

Advertiesment
తరగతి గదిలో రేప్ ప్రాక్టికల్స్... విద్యార్థులతో డెమో చేయించిన కీచక టీచర్లు
, శనివారం, 3 ఆగస్టు 2019 (09:16 IST)
విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన గురువులు... తమలోని వక్రబుద్ధిని బయటపెట్టారు. విద్యార్థులతో రేప్ డెమో చేయించారు. ఈ డెమో చేస్తూ ఓ విద్యార్థిని గాయపడింది. దీంతో ఈ విషయం బయటకు పొక్కడంతో గ్రామస్థులు ఆ ఇద్దరు ఉపాధ్యాయులకు దేహశుద్ధి చేశారు. 
 
ఈ ఘటన వెస్ట్ గోదావరి జిల్లా చింతలపూడిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, చింతలపూడి ప్రైమరీ పాఠశాలలో రాజశేఖర్, ఉమామహేశ్వర రావులు స్థానికంగా ఉండే ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఈ ఇద్దరు టీచర్లకు ఓ వికృతమైన ఆలోచన వచ్చింది. 
 
ఈ ఆలోచన వచ్చిందే తడవుగా నేరుగా తరగతి గదిలోకి వెళ్లి... అత్యాచారం ఎలా చేస్తారో చేసి చూపించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వారు మార్గం లేక.. తరగతి గదిలోనే రేప్ డెమోకు పూనుకున్నారు. ఈ డెమో చేస్తూ ఓ విద్యార్థిని గాయపడింది. 
 
ఫలితంగా ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన గ్రామస్థులు ఇద్దరు ఉపాధ్యాయులను పట్టుకుని చితకబాదారు. పైగా, ఈ విషయం విద్యాశాఖ ఉన్నతాధికారులకు, పోలీసులకు తెలిస్తే తమ ఉద్యోగాలు పోతాయని భావించి, గ్రామస్థులతో రాజీకొచ్చారు. ఇందుకోసం వారు తలా రూ.80 వేలు చొప్పున చెల్లించారు. 
 
అయితే, ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పాకి.. చివరకు జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. చిన్నారులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లల్ని ఆ క్యాబ్ డ్రైవర్ ఏం చేయబోయాడో చూడండి