Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో నేడు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఓపెన్

Advertiesment
public offices
, సోమవారం, 11 మే 2020 (08:09 IST)
తెలంగాణ ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ నిబంధనల్ని ఒక్కొక్కటిగా పక్కన పెట్టేస్తోంది. ఇటీవలే మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కారు.. ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలన్నీ తెరిచేయాలని డిసైడైంది.

తెలంగాణలో ఈ నెల 29 వరకూ లాక్‌డౌన్ అమల్లో ఉన్నా... ఇవాళ్టి నుంచి ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలకు రానున్నారు. గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో ఉన్న జిల్లాల్లోని ఉద్యోగులంతా విధులకు రావాలని ఆదేశాలు వెళ్లాయి. అందువల్ల జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి ఆఫీసులన్నీ పనిచేస్తాయి.

ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అందరూ పనిచేస్తారు. ప్రస్తుతం అన్ని జోన్లలో వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల ఉద్యోగులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు. ఇవాళ్టి నుంచి రెడ్‌జోన్ జిల్లాల్లో ఈ శాఖల ఉద్యోగులు పూర్తిస్థాయిలో పనిచేస్తారు.

మిగతా శాఖల ఉద్యోగులు మాత్రం రొటేషన్ పద్ధతిలో వస్తారు. 33 శాతం మంది మాత్రమే హాజరవుతారు. హైదరాబాద్ రెడ్ జోన్ పరిధిలో ఉంది కాబట్టి... ఇక్కడ రొటేషన్ పద్ధతి అమలవుతుంది.

ఐతే... ఐటీ కంపెనీలు కూడా ఇవాళ ప్రారంభమవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వెయ్యికి పైగా ఐటీ కంపెనీలు ఉన్నాయి కాబట్టి... అందరూ సొంత వాహనాలపై వస్తారు కాబట్టి... రోడ్లపై మళ్లీ ట్రాఫిక్ జామ్ తప్పదు. ఆల్రెడీ మే 7 నుంచి ట్రాఫిక్ పోలీసులు... సిగ్నల్ లైట్లను వాడటం మొదలుపెట్టారు.

ఐతే... ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకే ఇష్టపడుతున్నారు. అందువల్ల 15 శాతం మందే ఆఫీసులకు వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది.అన్ని రాష్ట్రాలూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటే... ఆల్రెడీ హైదరాబాద్ తప్ప మిగతా జిల్లాల్లో కరోనా కేసులు తగ్గడంతో... తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరపడుతోంది.

నిబంధనల్ని ఎత్తేస్తోంది. ఇప్పటికే నిర్మాణ, వ్యవసాయ రంగాల వ్యాపారాలు, పరిశ్రమలు, షాపులు తెరవొచ్చని చెప్పింది. ఐతే... ఉదయం 7 నుంచి రాత్రి 6 వరకు షాపులు తెరచుకుంటున్నాయి. ఆ తర్వాత ఉదయం 7 వరకూ కర్ఫ్యూ అమలవుతోంది.

ప్రజలే స్వయంగా ఇలాంటి అలవాటు చేసేసుకోవడంతో పోలీసులకు కాస్త ఉపశమనం కలుగుతోంది. ఈ నెల 15 సీఎం కేసీఆర్ రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ తర్వాత... మరిన్ని సడలింపులు, మినహాయింపులు ఇస్తారని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరుగులు తీయనున్న రైళ్లు .. కేంద్రం పచ్చజెండా :: అమెరికా నుంచి 25 వేల మంది