Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరుగులు తీయనున్న రైళ్లు .. కేంద్రం పచ్చజెండా :: అమెరికా నుంచి 25 వేల మంది

Advertiesment
పరుగులు తీయనున్న రైళ్లు .. కేంద్రం పచ్చజెండా :: అమెరికా నుంచి 25 వేల మంది
, ఆదివారం, 10 మే 2020 (18:01 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే నిమిత్తం దేశ వ్యాప్తంగా ప్రజారవాణాను కేంద్రం బంద్ చేసింది. దీంతో దేశంలో అన్ని రైళ్ళ రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న మూడో దశ లాక్‌డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. ఈ పరిస్థితుల్లో  ఈ నెల 12వ తేదీ నుంచి దేశంలోని కీలక నగరాలకు రైళ్ళను నడిపేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఫలితంగా దేశంలోని ప్రధాన నగరాల మధ్యే ఈ రైలు రాకపోకలు కొనసాగనున్నాయి. 
 
ముఖ్యంగా, దేశ రాజధాని ఢిల్లీ నుంచి 15 ముఖ్య నగరాలకు ప్రయాణికుల రైళ్లు నడపనున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్‌సీటీసీ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్స్ షురూ కానున్నాయి. ఢిల్లీ నుంచి సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై సెంట్రల్, తిరువనంతపురం, అహ్మదాబాద్, జమ్మూతావి, అగర్తలా, హౌరా, పాట్నా, దిబ్రూగఢ్, బిలాస్ పూర్, రాంచీ, భువనేశ్వర్ నగరాలకు రైళ్లను నడపనున్నారు. అయితే, ఈ రైళ్లలో కరోనా లక్షణాలు లేనివారినే రైళ్లలో అనుతిస్తారు. పైగా, ఈ రైళ్ళలో ప్రయాణించేందుకు కేంద్రం ప్రత్యేకంగా మార్గద్శకాలను జారీచేయనుంది. 
 
స్వదేశానికి 25 వేల మంది ప్రయాణికులు 
 
మరోవైపు, వందే భారత్ మిషన్‌లో భాగంగా, అమెరికా నుంచి భారత్‌కు 25 వేల మంది భారతీయులు రానున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శాన్‌ఫ్రాన్సిస్‌కో నుంచి భార‌త్‌కు తొలి విమానం బయ‌లుదేర‌నుం‌ది. అమెరికాలోని నాలుగు ఎయిర్‌పోర్టుల నుంచి భారత్‌కు ఏడు ఎయిరిండియా విమానాలు న‌డుపుతున్న‌ట్లు భారత రాయబారి త‌ర‌ణ్‌జిత్ సింగ్ సంధు మీడియాకు చెప్పారు.
 
తొలి దశలో సుమారు 25 వేల మంది భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్న‌ట్లు ఆయ‌న వివరించారు. భారత్‌లోని పలు నగరాల్లోని విమానాశ్రయాలకు అవి చేరుకుంటాయని చెప్పారు. కాగా, కరోనా వ్యాక్సిన్‌ కోసం భారత్‌, అమెరికా కలిసి పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు.
 
భారత్‌లోని ఐసీఎంఆర్‌, అమెరికాలోని సీడీసీ-ఎన్ఐసీలు చాలా ఏళ్ల నుంచి ఆరోగ్యరంగంలో కలిసి పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. రెండేళ్ల‌క్రితం ఈ రెండు సంస్థలు కలిసి రోటోవైర‌స్ కోసం వ్యాక్సిన్ క‌నుగొన్నాయని, దానితో భార‌త్‌, అమెరికా సహా  అనేక దేశాలు లాభపడ్డాయని వివరించారు. ఇరు దేశాలు కలిసి మూడు వ్యాక్సిన్ల త‌యారీలో క‌లిసి ప‌నిచేస్తున్నాయని చెప్పారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోటల్ గదిలో తెరాస నేత వ్యభిచారం.. అరెస్టు