Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నెలలో 9 బిలియన్ వీడియోలను వీక్షించిన భారతీయ వీడియో యాప్ మిత్రోన్

నెలలో 9 బిలియన్ వీడియోలను వీక్షించిన భారతీయ వీడియో యాప్ మిత్రోన్
, బుధవారం, 5 ఆగస్టు 2020 (19:13 IST)
చైనీస్ యాప్‌లపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటి నుండి ఒక నెలలో మొత్తం 9 బిలియన్ వీడియోలను వీక్షించిన మిత్రోన్, ఒక చిన్న-రూపం వీడియో యాప్, దాని విభాగంలో భారీ ప్రేక్షకులను సంపాదించింది. గూగుల్ స్టోర్‌లో మిత్రోన్ యాప్ 33 మిలియన్ డౌన్‌లోడ్‌లను దాటిందని కంపెనీ ప్రకటించింది.
 
ఈ అభివృద్ధిపై మిత్రోన్ వ్యవస్థాపకుడు మరియు సిఇఒ శివాంక్ అగర్వాల్ మాట్లాడుతూ, “ఈ యాప్ అభివృద్ధి చేయడం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, చిన్న వీడియోల శ్రేణిని అప్‌లోడ్ చేయడానికి మరియు చూడటానికి వినియోగదారులను అనుమతించే ప్లాట్‌ఫామ్‌ను అందించడం. అతి తక్కువ వ్యవధిలో మిత్రోన్ యాప్ సంపాదించిన ప్రజాదరణను ఇలా చూడటం హృదయపూర్వకంగా ఎంతో సంతోషంగా ఉంది. మిత్రోన్ ప్లాట్‌ఫామ్‌లో సృష్టించబడిన మిలియన్ల కొత్త వీడియోలను చూడటం నమ్మశక్యం కాదు. ఈ యాప్‌ను తమ రోజువారీ వినోద రూపంగా ఉపయోగిస్తున్న మా వినియోగదారులందరికీ ధన్యవాదాలు.”
 
డిజిటల్ ఎంగేజ్‌మెంట్ మరియు వినోదాన్ని పునఃరూపకల్పన చేసే ఒక చిన్న-రూపం వీడియో యాప్‌ను రూపొందించే లక్ష్యంతో, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ యొక్క పూర్వ విద్యార్థి సహ వ్యవస్థాపకులు శివాంక్ అగర్వాల్ మరియు నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి అనీష్ ఖండేల్వాల్ ఏప్రిల్, 2020లో మిత్రోన్ యాప్‌ను ఆవిష్కరించారు.
 
"దేశవ్యాప్తంగా చిన్న నగరాలు మరియు పట్టణాల నుండి మేము బలమైన ట్రాక్షన్‌ను చూస్తున్నాము, కర్నాల్, హుబ్లి, భావ్‌నగర్, అలీఘడ్, లుధియానా మరియు విజయవాడ వంటి పట్టణాలు 1,00,000 మందికి పైగా వినియోగదారులను కలిగి ఉన్నాయి" అని శివాంక్ తెలిపారు.
 
సహ వ్యవస్థాపకుడు మరియు సిటిఓ అనీష్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, “మా వినియోగదారుల వృద్ధి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ, వినియోగదారుల ఒప్పుదల మరియు నిలుపుదలపై మా ప్రయత్నాలను మేము ఎంతో ఆసక్తిగా కేంద్రీకరిస్తున్నాము. సగటున ప్రతి యూజర్ రోజుకు 80 వీడియోలను చూస్తున్నారు. అనేక కొత్త ఉత్పత్తి లక్షణాలతో, ఒప్పుదల మరింత పెరుగుతుందని మేము విశ్వసిస్తున్నాము”

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైద్య సిబ్బంది నియామకాలలో మెరిట్‌ రోస్టర్‌ ప్రాతిపదికనే భర్తీ: మంత్రి పేర్ని నాని