Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎంసెట్-2020 కౌన్సిలింగ్‌లో స్వల్ప మార్పులు

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (12:15 IST)
ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించే తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 9నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్ ప్రక్రియలను ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మొదలు కాగా, వెబ్ ఆప్షన్ ప్రక్రియ సోమవారం(ఈ నెల 12) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.
 
అయితే ఇటు కాలేజీలకు యూనివరిసిటీ అప్లియేషన్స్ జారీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండడం, ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన కొన్ని కోర్సులకు ఇంకా అనుమతి రాకపోవడంతో అధికారులు కౌన్సిలింగ్ తేదీల్లో స్వల్ప మార్పు చేశారు. ఈ నెల 18వ తేదీ నుండి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే విధంగా అధికారులు మార్పు చేశారు.
 
18వ తేది మొదలు కానున్న వెబ్ ఆప్షన్లు 22వ తేదీ వరకు ఇచ్చేలా వీలు కల్పించారు. అభ్యర్థి  ఎంచుకున్న ఆప్షన్లు ప్రీజ్ కావడంతో ఈ నెల 24న సీట్ల అలాట్మెంట్ పూర్తవుతుంది. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 201 ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సులకు 1,10,873 సీట్లున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీలు 2020-21 విద్యా సంవత్సరంలో వివిధ కొత్త కోర్సులు ప్రవేశ పెట్టడానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఆ కోర్సులను, సీట్లను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. దీంతో వారంపాటు ఆప్షన్ల నమోదును వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

తర్వాతి కథనం
Show comments