Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీస్‌ఘడ్‌లో దారుణం.. ప్రేమికులను విషమిచ్చి.. హత్యచేసి తగలబెట్టేశారు..

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (12:01 IST)
ఛత్తీస్‌ఘడ్‌లో దారుణం చోటుచేసుకుంది. బంధువులే పరువు హత్యకు పాల్పడ్డారు. బంధువులయ్యే ఇద్దరు ప్రేమించుకున్నారు. కానీ వారి ప్రేమను ప్రేమను అంగీకరించని కుటుంబ సభ్యులు వారిని హత్యచేసి తగలబెట్టారు. చత్తీస్‌ఘడ్‌లోని దుర్గ్ జిల్లా, సుపేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా నగర్‌లో పక్క, పక్క ఇళ్లల్లో నివసించే శ్రీహరి(21) ఐశ్వర్య(20)లు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకుని ఇంట్లో వాళ్లకు చెప్పారు. వారిద్దరి ప్రేమపెళ్లికి ఇరు కుటుంబాల్లో పెద్దలు అభ్యంతరం చెప్పారు.
 
తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోయేసరికి ప్రేమికులిద్దరూ గత సెప్టెంబర్ నెలలో ఇంటి నుంచి పారిపోయి పెళ్లిచేసుకున్నారు. రెండు కుటుంబాలవారు పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రేమికులిద్దరినీ తమిళనాడులోని చెన్నైలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 7 వారిని చెన్నై నుంచి స్వగ్రామం సుపేలా తీసుకువచ్చి, వారి తల్లితండ్రులకు అప్పగించారు.
 
అప్పటినుంచి పోలీసులు వారి ఇళ్పపై నిఘా ఉంచారు. చివరికి కుటుంబ సభ్యులే వారి హత్యకు కారణమని తేలింది. ఇంకా ప్రేమికులిద్దరికీ విషం పెట్టి చంపేసామని కుటుంబ సభ్యులే అంగీకరించారు. ఈ ఘటనకు సంబంధించి శ్రీహరి మేనమామ రాము, ఐశ్వర్య సోదరుడు చరణ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాల గురించి ఆరా తీయగా తగులబెట్టినట్లు నిందితులు షాకింగ్ విషయాలు చెప్పారు.
 
నిందితులు చెప్పిన ఆధారాలతో పోలీసులు సుపేలాకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెవ్రాసిర్సా గ్రామంలోని శివనాధ్ నది ఒడ్డున సగం కాలిపోయిన ప్రేమికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments