ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం మావోయిస్టులకు అడ్డాగా మారింది. ప్రతిరోజు ఏదో ఒక చోట అలజడి సృష్టించడం, ఘాతుకానికి పాల్పడటం జరుగుతూనే ఉంటాయి. ఇందుకు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఆపరేషన్ నిర్వహిస్తూ ఉంటారు. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా ప్రతి నిత్యం పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. అయినా మావోయిస్టులు రెచ్చిపోతున్నారు.
తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో మావోలు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలో మావోలు మెటాపాల్ కుస్నార్ గ్రామానికి చెందిన 25 మందిని కిడ్నాప్ చేశారు. పోలీసు ఇన్‌ఫార్మర్ నెపంతో గ్రామస్థులను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.
రెండు రోజుల కిందట కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. ప్రజా కోర్టు నిర్వహించినట్లు తెలుస్తోంది. వారిలో నలుగురిని హతమార్చారు. అందులో ఐదుగురిని విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన దంతెవాడ, బీజాపూర్ జిల్లా సరిహద్దులో శుక్రవారం రాత్రి జరిగినట్లు సమాచారం. ఇంకా 16మంది మావోయిస్టుల చెరలోనే ఉన్నట్లు తెలుస్తోంది.