Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల డబ్బులంటూ లోనికి పిలిచి.. మైనర్ బాలికపై అత్యాచారం

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (08:35 IST)
మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అడిషనల్ డీజీపీ సిద్ధికి, ఏసీపీ తిరుపతన్న లు కేసు వివరాలు వెల్లడించారు.

రాజ్ భవన్ కు ఎదురుగా ఉన్న ఎంఎస్ మక్తా లో నివాసముండే షేక్ జహంగీర్ (35) స్థానికంగా పంచర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. వీరి ఇంటికి సమీపంలోని ఓ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా విధులు నిర్వహించే రెహనా బేగం కుటుంబం ఉంటుంది.

సాధించుకునే అపార్ట్మెంట్లో వాచ్మెన్ నిర్వహించడంతోపాటు పాల ప్యాకెట్లను విక్రయిస్తున్న టారు. వీరి చిన్న కుమార్తె (13) స్థానికంగా ఉన్న ఓ మదర్సాలో విద్యాభ్యాసం చేస్తుంది.  ఉదయం సాయంత్రం వేళల్లో పాల విక్రయాలకు తల్లిదండ్రులకు సహాయంగా ఉంటుంది.

వీరు నిందితుడైన జహంగీర్ ఇంటికి సైతం పాలు విక్రయిస్తుంటారు. ఉదయం కూడా పాలన అందించి సాయంత్రం వేళల్లో డబ్బులు వసూలు చేసేందుకు 13 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్తుంది. చాలా కాలంగా గమనిస్తున్న జహంగీర్ బాలికలు డబ్బులు ఇస్తాను అంటూ లోనికి పిలిచి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

గత పది రోజులుగా బాలిక  నీరసంగా కనిపిస్తుండడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. భయం భయంగా జరిగిన విషయాన్ని తల్లికి తెలిపింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన తల్లి రెహనా అర్ధరాత్రి పోలీసులను ఆశ్రయించింది.

ఈ మేరకు నిందితుడు జాంగిర్ పై పోస్కో యాక్ట్ 2012, రేప్ తదితర సెక్షన్ల కిందకేసు నమోదు చేశారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.

బాధిత బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో సిఐ నిరంజన్ రెడ్డి, డిఐ నాగయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments