Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఇకపై శనివారాల్లోనూ పాస్‌పోర్టు సర్వీసులు

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2022 (11:39 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇకపై శనివారాల్లో కూడా పాస్‌పోర్టు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇకపై మరింత వేగంగా పాస్‌పోర్టు పొందే అవకాశం ఉంది. తొలి దశలో నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ నగరాల్లోని కార్యాలయాలు కూడా శనివారాల్లో పనిచేస్తాయి.  
 
ప్రస్తుతం ఈ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా వారంలో ఐదు రోజులు మాత్రమే పనిచేస్తున్నాయి. సెప్టెంబరు మూడో తేదీ నుంచి శనివారాల్లో కూడా పని చేయనున్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రం అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు. విదేశాలకు వెళ్లందుకు పాస్‍‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారు వారాల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా పరిశీలనకు మూడు వారాల సమయం పడుతుంది.
 
ఈ నేపథ్యంలో ఇటీవల ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని సందర్శించిన వీసా, పాస్‌పోర్టు విదేశీ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎ.సయీద్ దృష్టికి అధికారులు ఈ విషయాన్ని తీసుకెళ్ళగా ఆయన సానుకూలంగా స్పందించి, శనివారం కూడా ఈ కేంద్రాలు పని చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీచేశారని తెలిపారు. దీంతో వచ్చే నెల 3వ తేదీ నుంచి హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలోని టోలీచౌకి, బేగంపేట, అమీర్‌పేట, నిజామాబాద్, కరీంనగర్ పాస్‌పోర్టు కేంద్రాలు ప్రతి శనివారం తెరుచుకుంటాయని దాసరి బాలయ్య వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments