తెలంగాణ పోలీసు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీశాఖలో 614 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆగస్టు 28వ తేదీన రాత పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగే ఈ పరీక్షకు 6,61,196 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
చేతి గడియారాలతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలనూ కేంద్రాల్లోకి అనుమతించరు. హాల్‌టికెట్లను నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ భద్రపరచుకోవాలి. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను అధికారులు వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచారు.
వీటిని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే అభ్యర్థుల యొక్క లాగిన్ ఐడీ, పాస్ వర్డ్‌లను ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నేడు (ఆగస్టు 26) అర్థరాత్రి 12 గంటల వరకు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.