Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాది రెండు కళ్ల సిద్ధాంతం కాదు.. చంద్రబాబే మా నేత : మోత్కుపల్లి

గవర్నర్ పదవి వస్తుందని గత మూడేళ్లుగా ఆశగా ఎదురు చూస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. అయితే, తాజాగా కేంద్రం నియమించిన గవర్నర్ల జాబితాలో తన పేరు

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (15:24 IST)
గవర్నర్ పదవి వస్తుందని గత మూడేళ్లుగా ఆశగా ఎదురు చూస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. అయితే, తాజాగా కేంద్రం నియమించిన గవర్నర్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైనట్టు చెప్పారు. ఈ కారణంగానే తన కుటుంబ సభ్యలు కన్నీరు పెట్టుకున్నారనీ, పైపెచ్చు దసరా పండుగను కూడా జరుపుకోలేదని ఆయన వాపోయారు. 
 
తెలంగాణాలో మోత్కుపల్లి నర్సింహుల్ సీనియర్ నేత. ఆయనకు గవర్నర్ పదవిని ఇప్పించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకెళ్లగా, ఆయన కూడా సమ్మతించారు. ఇలా చెప్పి మూడేళ్లు గడిచిపోయింది. దీంతో మోత్కుపల్లి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, గవర్నర్ పదవి రాకపోవడంతో నిరాశచెందానని అన్నారు. తన కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకున్నారని ఆయన తెలిపారు. తాను మరింత నిరాశచెందానని ఆయన చెప్పారు. ఆ బాధతో దసరా కూడా చేసుకోలేదని ఆయన అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తనకు నమ్మకం ఉందన్నారు. కనీసం రాజ్యసభ పదవి అయినా వస్తుందని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. 
 
ఇకపోతే.. తెలంగాణాలో టీడీపీ పరిస్థితిపై ఆయన స్పందిస్తూ.. భవిష్యత్‌లో బీజేపీ, టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవచ్చు కానీ, కాంగ్రెస్‌తో మాత్రం పొత్తు పెట్టుకోవద్దని సూచించారు. ఎందుకంటే.. పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే టీడీపీని స్థాపించారని ఆయన గుర్తు చేశారు. అయితే, ఇపుడు కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరడం బాధ కలిగిస్తోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments