Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్ ఎన్టీఆర్ అంతటివారు... టీడీపీలో మోత్కుపల్లి వ్యాఖ్యల కలకలం...

గవర్నర్ కావాలన్నది మోత్కుపల్లి చిరకాల కోరిక. ఆ వీక్‌నెస్‌ను ఆసరగా చేసుకుని రెండున్నరేళ్లుగా మోత్కుపల్లితో టీడీపీ నేతలు గేమ్స్ ఆడుతున్నారు. టీడీపీ అనుకూల పత్రిక ఒకటి అయితే మోత్కుపల్లికి అదిగో గవర్నర్‌ గిరి… ఇదిగో గవర్నర్ గిరి అంటూ వారానికో కథ రాసి లేన

కేసీఆర్ ఎన్టీఆర్ అంతటివారు... టీడీపీలో మోత్కుపల్లి వ్యాఖ్యల కలకలం...
, గురువారం, 6 అక్టోబరు 2016 (21:35 IST)
గవర్నర్ కావాలన్నది మోత్కుపల్లి చిరకాల కోరిక. ఆ వీక్‌నెస్‌ను ఆసరగా చేసుకుని రెండున్నరేళ్లుగా మోత్కుపల్లితో టీడీపీ నేతలు గేమ్స్ ఆడుతున్నారు. టీడీపీ అనుకూల పత్రిక ఒకటి అయితే మోత్కుపల్లికి అదిగో గవర్నర్‌ గిరి… ఇదిగో గవర్నర్ గిరి అంటూ వారానికో కథ రాసి లేనిపోని ఆశలు రేపుతూ వచ్చింది. టీడీపీ కోసం పోరాడి అన్నీ పోగొట్టుకుని అలసిపోయాను, ఏదో ఒకటి ఇచ్చి ఆదుకోండి అంటూ మహానాడు వేదికగానే మోత్కుపల్లి బతిమలాడుకున్నారు. కానీ రెండున్నరేళ్లు గడుస్తున్నా మోత్కుపల్లికి గవర్నర్‌ పదవి రాలేదు. వస్తున్న వాసన కూడా లేదు. 
 
ఈ నేపథ్యంలో మోత్కుపల్లి హఠాత్తుగా కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. కేసీఆర్‌ ఏన్టీఆర్ దారిలో నడుస్తున్నారని కీర్తించారు. యాదాద్రిని కొత్తజిల్లాగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. కొమురం భీం విషయంలో కేసీఆర్‌ తీరు అభినందనీయమన్నారు. ప్రజల కోసం ఎన్టీఆర్ మండలాలను పెట్టారని… ఇప్పుడు కేసీఆర్‌ కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ఎన్టీఆర్ దారిలో నడుస్తున్నారని అందుకోసం అభినందనీయమన్నారు. 
 
కేసీఆర్‌ అంటే ఒంటి కాలిపై లేచే మోత్కుపల్లి హఠాత్తుగా ఆయనపై ప్రశంసలు కురిపించడంపై టీడీపీలో కలకలం రేగింది. గవర్నర్‌ పదవి ఇస్తామంటూ తన వీక్‌నెస్‌తో టీడీపీ నాయకత్వం నాటకాలు ఆడుతోందన్న భావనకు మోత్కుపల్లి వచ్చారా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది. చంద్రబాబును నమ్ముకుంటే ఇక అయ్యేపని కాదన్న ఉద్దేశంతోనే కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించి ఉండవచ్చని చెబుతున్నారు. అయినా టీడీపీ కోటాలో కేంద్ర ప్రభుత్వం ఒక గవర్నర్ పదవిని ఆఫర్ చేసినా… మోత్కుపల్లికి చంద్రబాబు ఇస్తారా? అనేదే ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరకట్నం వేధింపులతో భార్య ఆత్మహత్య.. భర్త జైలుకు.. పోలీసులే అత్తకు వైద్యం ఇప్పించారు..