Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ కొనివ్వకపోవడంతో తల్లినే చంపేశాడు.. ఎక్కడ?

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (20:46 IST)
స్మార్ట్ ఫోన్ లేనిదే పొద్దు గడవట్లేదు చాలామంది. అదీ కరోనా కాలంలో స్మార్ట్ ఫోన్ లేనిదే ఏ పని జరగట్లేదు. కరోనా కారణంగా ఆన్‌లైన్ క్లాసుల పుణ్యమా అని ఇప్పుడు చిన్నపిల్లలూ స్మార్ట్ ఫోన్‌లకు అలవాటయ్యారు. ఆ అలవాటే ఓ యువకుడిని నేరస్థుడిగా మార్చింది. 
 
సెల్ ఫోన్ కొనివ్వాలంటూ ఓ యువకుడు తన తల్లిని దారుణంగా హత్య చేశాడు. రోకలితో తలపై కొట్టి మరీ అంతమొందించాడు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఉండవల్లి మండలంలోని శేరిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులకు ఇద్దరు కుమారులు. లక్ష్మి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. పెద్ద కుమారుడు మహేశ్‌ ఇంటర్‌ పూర్తి చేశాడు.  
 
ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వాలని తల్లిని కోరాడు. డబ్బులు లేవని, తర్వాత కొనిస్తానని తల్లి చెప్పింది. కానీ స్మార్ట్ ఫోన్ కొనివ్వాల్సిందేనని పట్టుబట్టాడు. ఈ విషయంపై తల్లీ కుమారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 
 
ఈ క్రమంలో శుక్రవారం మరోసారి తల్లితో గొడవపడ్డాడు. ఆవేశంతో రోకలిబండతో తల్లి తలపై కొట్టాడు. ఆమె తీవ్రగాయాలపాలై మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments