మాతృత్వానికే మాయని మచ్చ తెచ్చింది. కన్నబిడ్డను అత్యంత దారుణంగా హత్య చేసింది. రెండు నెలల పసిగుడ్డును అత్యంత దారుణంగా గొంతు నులిమి చంపి ఆ తరువాత మృతదేహాన్ని మైక్రో ఓవెన్‌లో పెట్టి కాల్చింది. ఈ అత్యంత దారుణం ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే., ఢిల్లీలోని మాలవీయ నగర్లో రెండు నెలల కన్నకూతుర్ని గొంతు నులిమి దారుణంగా హత్య చేసి చిన్నారి మృతదేహాన్ని ఒవెన్లో పెట్టింది.
మాలవీయ నగర్లోని చిరాగ్ ఏరియాలో గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ అనే దంపతులకు రెండు నెలల కిందట ఆడపిల్ల పుట్టింది. అయితే ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేని డింపుల్ బిడ్డ గొంతు నులిమి చంపేసింది. ఆ తరువాత వంట గదిలోని మైక్రోఓవెన్‌లో పెట్టింది.
ఈ దృశ్యాలను వేరే గదిలో ఉన్న చిన్నారి నానమ్మ చూడటంతో బిగ్గరగా అరిచింది. దీంతో స్థానికులు ఆమె అరుపులకు పరుగులు తీసుకుంటూ వచ్చినా ఆ చిన్నారిని కాపాడలేకపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.