పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‍గా వున్న తనకు ఝలక్ ఇచ్చానని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు.. ఈ పరిణామంతో తనను మరిం హాట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "నాకు రాజకీయ ఝలక్ రేవంత్ ఇచ్చుడు కాదు.. నేను ఇస్తా.." అని ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న మజా ఇంకో పార్టీలో ఉండదన్న ఆయన.. రేవంత్‌పై బురద జల్లే అవసరం తనకు లేదు.. ఇలాంటి అవకాశం కల్పించింది కూడా రేవంతేనని వెల్లడించారు.
అయితే, ముత్యాల ముగ్గు సినిమాలో హీరోయిన్ టైపు అయ్యింది తన పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.. తాను హీరోయిన్.. హీరో కాంగ్రెస్ పార్టీ .. విలన్ రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించిన ఆయన.. చంద్రబాబు.. రేవంత్‌రెడ్డికి కరెక్ట్ ట్రైనింగ్ ఇవ్వలేదు అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీతో కానీ.. సోనియా, రాహుల్ గాంధీతో గానీ ఎలాంటి ఇబ్బంది లేదన్నారు జగ్గారెడ్డి.. కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత రాజకీయంగా ఎదిగాను.. విజయవంతంగా నడిపించుకున్నాను.. ఉన్నది ఉన్నట్టు చెప్పడం నాకున్న అలవాటు అన్నారు.. రాష్ట్ర విభజన సమయంలో కూడా అలాగే చెప్పినా.. విడిపోతే నష్టం అని చెప్పినా.. ఆ రోజు తెలంగాణ ద్రోహిగా ముద్ర వేశారని గుర్తుచేసుకున్నారు.