క్రియేట్ దర్శకుడు రాజమౌళిని తిట్టాలంటే ఆ స్థాయి కావాలి. చనువు కావాలి. అవి రెండూ వున్న హీరో ఎన్.టి.ఆర్. మాత్రమే. ఆర్.ఆర్.ఆర్. సినిమాలో రామ్‌చరణ్ కూడా నటించినా ఆయనకు అంత సీన్ లేదు. కానీ ఎన్.టి.ఆర్.కు వుంది. యమదొంగ సినిమా ఆయనతో చేశాడు. 21 ఏళ్ళుగా రాజమౌళి గురించి తనకు తెలుసునని ఎన్.టి.ఆర్. చెబుతూ. అల్పుడు, అథములకు ఏమీ చెప్పలేమని రాజమౌళిని ఘాటుగా తిట్టాడు. ఈ సంఘటన ఇటీవలే హైదరాబాద్‌లో మీమ్స్ గురించి జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో యాంకర్, నటి సుమ వీరిని మినీ ఇంటర్వ్యూ చేశారు.
ఈ సందర్భంగా షూటింగ్‌లో జరిగిన పలు విషయాలను ఆమె అడిగారు. అతి కష్టమైనది ఏమిటంటే.. ఇద్దరు హీరోలు రాజమౌళి తమని పిండి పిప్పి చేశారని పేర్కొన్నారు. `నాటు నాటు.. సాంగ్..` చేసేటప్పుడు స్టెప్ సరిగ్గా రాలేదని 17 సార్లు చేయించారు. అదికూడా స్లో ఎమోషన్‌లో దర్శకుడు మోనిటర్‌లో చూసి, కుడికాలు కాస్త తక్కువ లేపావు. చరణ్ కాలుకు బేలన్స్ అవ్వడంలేదని అన్నాడు. మామూలుగా చూస్తే చాలా బాగా వచ్చింది. చూస్తేనే తెలుస్తుంది. అంత స్లోమోషన్‌తో ప్రేక్షకుడు చూపించరగదా. అని ఎన్.టి.ఆర్. అంటే, నాకు ఇంకా శాటిస్‌ఫైకాలేదని అనేవాడు. ఒక దశలో బూతులుకూడా తిట్టేవాడు మమ్మల్ని.
ఫైనల్‌గా ఎన్నో టేక్ ఓకే చేశారో తెలుసా! మీకు.. అంటూ సుమకు సమాధానం చెబుతూ, రెండో టేక్ ఓకేచేశాడు. మరి అప్పుడే మాకు క్లారిటీ ఇస్తే బాగుండేదికదా.. ఇంత కష్టపడి ఎగిరి, ఎనర్జీ అంతా పిండేశావ్.. అంటే.. వినలేదు. అందుకే ఇలాంటి అల్పులకు, అథములకు ఏమీ చెప్పలేమంటూ.. ఫ్లోలో సున్నితగా రాజమౌళిని ఎన్.టి.ఆర్. చురక వేశారు. కానీ దీన్ని స్పోర్టివ్‌గా తీసుకుని రాజమౌళి నవ్వేశారు. మా కష్టాన్ని వల్లిగారికి చెప్పాం. ఏంటి ఆంటీ.. ప్రతి టేక్‌ను ఇలా చేస్తున్నాడు.. అని చెబితే, ఆమె, ఆయన పిచ్చోడు బాబు..అలాగే చేష్టలు వుంటాయి. అంటూ సమాధానం చెప్పింది. నిజంగా రాజమౌళి పిచ్చోడో.. అంటూ మరో చురక వేశాడు. ఇలా ఇద్దరు హీరోలు తన కష్టాన్ని తిట్లను సరదాగా చెబుతూ ప్రోగ్రామ్‌ను రక్తికట్టించారు.