Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్చిలో పెళ్లి.. వరుడు మోసం చేశాడని ఓ యువతి పెళ్లిని ఆపేసింది..

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (20:52 IST)
ప్రస్తుతం పెళ్లిళ్లు పీటలవరకు వచ్చి ఆగిపోవడం ఫ్యాషనైపోయింది. మొన్నటికి మొన్న తాళికట్టే సమయంలో ఓ వధువు ప్రియుడొస్తున్నాడని.. అతనితో తన పెళ్లి జరగాలంటూ పట్టుబట్టి పెళ్లి ఆపేసింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో కూడా ఓ సంఘటన చర్చిలో జరగాల్సిన పెళ్లిని ఆగిపోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ వెస్లీ చర్చిలో పెళ్లి జరుగుతోంది. ఇరు కుటుంబ సభ్యులంతా వివాహానికి హాజరయ్యారు. 
 
జనగామ జిల్లాకు చెందిన అనిల్‌తో హైదరాబాద్ తుకారాంగేట్‌కు చెందిన యువతితో చర్చ్ ఫాదర్లు వివాహం జరిపిస్తున్నారు. ఇంతలో ఓ యువతి అక్కడ ప్రత్యక్షమై.. అనిల్‌ తనను ప్రేమించి మోసం చేశాడంటూ పెళ్లిని అడ్డుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు చర్చ్ బిల్డింగ్ దగ్గరకు చేరుకుని యువతిని ప్రశ్నించారు. పెళ్లి ఆపిన యువతి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు తిప్పి పంపేశారు.
 
మరోవైపు పెళ్లి చేసుకోబోతున్న తుకారాంగేట్‌కు చెందిన వధువు కూడా మైనర్ కావడంతో చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ పెళ్లిని ఆపేశారు. అనంతరం మోండా మార్కెట్‌ పోలీస్ స్టేషన్‌లో చైల్డ్‌లైన్, ఐసీడీఎస్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పెళ్లికి వచ్చిన వారంతా చేసేదేమీలేక ఎవరి ఇళ్లకు వారు వెనుదిరిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments