Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓ కృష్ణుడు - ముగ్గురు రాధలు.. అన్యోన్యంగా కాపురం చేస్తున్న దంపతులు!

Advertiesment
Three Wives
, శుక్రవారం, 6 నవంబరు 2020 (08:36 IST)
ఈ కాలంలో ఒక్క భార్యతో సంసారం చేసేందుకు కొంతమంది పురుషులు నానా అవస్థలు పడుతున్నారు. అలాంటిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విడ్డూరం చోటుచేసుకుంది. ఓ కృష్ణుడు, ముగ్గురు రాధల సంసారజీవిత కథ ఒకటి వెలుగులోకి వచ్చింది. పైగా, ఈ కృష్ణుడు ముగ్గురు భార్యలతో సంసార జీవితాన్ని సాఫీగా గడుపుతున్నారు. అలాగే, ఆ ముగ్గురు రాధలు కూడా ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. వారి పేరు... పింకీ, శోభ, రీనా. వారు ముగ్గురూ తోబుట్టువులే. వీరికి చిన్నప్పటి నుంచి ఏంచేసినా కలిసే చేయడం అలవాటు. ముగ్గురూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
 
పెళ్లి విషయానికొచ్చినా తమ అలవాటు తప్పలేదు. చిత్రకోట్‌కు చెందిన కృష్ణను ఈ ముగ్గురు సోదరీమణులు పెళ్లాడారు. వీరి పెళ్లి జరిగి పన్నెండేళ్లు అవుతోంది. ఇటీవల కర్వాచౌత్ పండుగ సందర్భంగా వీరంతా తమ భర్త క్షేమం కోరుతూ చంద్రుడికి పూజలు చేశారు. జల్లెడ లోంచి తమ భర్తను చూస్తూ మురిసిపోయారు. దీనికి సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
 
కాగా, కృష్ణకు మొత్తం ఆరుగురు పిల్లలట. ఒక్కో భార్యతో ఇద్దరు పిల్లల్ని కన్నాడు. ఇంతజేసీ మన కృష్ణుడికి ఒక్కరోజు కూడా భార్యలతో గొడవలు రాలేదట. వాళ్లందరూ చిత్రకోట్‌లోన స్థానిక కంసీరామ్ కాలనీలో కలిసే ఉంటారని ఓ బంధువు వెల్లడించాడు. అయితే, కృష్ణ ఆ ముగ్గురినీ ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఇప్పటికీ తెలియదని అతగాడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు!