Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబులెన్స్‌లో సజీవదహనమైన 15 గోవులు

Webdunia
ఆదివారం, 1 మే 2022 (12:53 IST)
నిజామాబాద్ జిల్లా జాతీయ రహదారిలో ఒక అంబులెన్స్ ఎమర్జెన్సీ అని స్టిక్కర్ అని అతికించుకున్న వాహనంలో మంటలు చెలరేగి, అందులో ఉన్న 15 ఆవులు సజీవదహనమయ్యాయి. ఈ దారుణం జిల్లాలోని ఇందల్వాయి పరిధిలోని మాక్లూర్ తండా శివారు జాతీయ రహదారిపై జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒక వాహనానికి అంబులెన్స్‌ అంటూ స్టిక్కర్‌ అంటించుకున్నారు. ఈ వాహనం ఇంజిన్‌లోని మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర్‌ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేసి పరారయ్యాడు. వెనుక వస్తున్న వాహనదారులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. 
 
ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వాహనం డోర్‌ను తీసేందుకు ప్రయత్నించగా తెరుచుకోలేదు. దీంతో అందులో ఉన్న 15 ఆవులు మంటల్లో కాలిపోయాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments