తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మడిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిల్లో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా, వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండటంతో జనం అల్లాడిపోతున్నారు.
అమరావతి ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించిన సమాచారం మేరకు ఏపీ రాష్ట్రంలో 44 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
మరోవైపు, తెలగాణాలో నిన్న వడగాలుల దెబ్బ వల్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్ జిల్లాలోని రెంజల్‌లో నిన్న రికార్డు స్థాయిలో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.