Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేపల్లే రైల్వే స్టేషన్‌లో వలసకూలీపై సామాహిక అత్యాచారం

Advertiesment
rape victim
, ఆదివారం, 1 మే 2022 (08:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వరుసగా రేప్ సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మతిస్థిమితం లేని యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఆ తర్వాత గుంటూరులో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన మరచిపోకముందే ఇదే జిల్లాలో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ ఘటనలు రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించాయి. వీటి నుంచి ప్రజలు ఇంకా తేరుకోకముందే తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. రేపల్లే రైల్వే స్టేషనులో పొట్ట చేతపట్టుకుని వచ్చిన వలస కూలీ మహిళపై అత్యాచారం జరిగింది. ఆమె భర్తను చితకబాది ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే,
 
అవనిగడ్డలో కూలీ పనుల కోసం భార్యాభర్తలిద్దరూ వేరే ప్రాంతం నుంచి శనివారం అర్థరాత్రి సమయంలో రైపల్లే రైల్వే స్టేషన్‌లో దిగారు. ఆ సమయంలో అవనిగడ్డ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో స్టేషన్‌లోన బల్లల మీద పడుకున్నారు. ఇదేసమయంలో వచ్చిన ముగ్గురు కామాంధులు ఆ మహిళను బలవంతంగా లాక్కొళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారికి అడ్డుపడిన భర్తపై కూడా విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. 
 
దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితులను ఎర్రగొండపాళెంకు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల నుంచి సమాచారం సేకరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం