Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుంటూరు దుగ్గిరాల మండలంలో మహిళపై సామూహిక అత్యాచారం

rape
, గురువారం, 28 ఏప్రియల్ 2022 (13:25 IST)
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మతిస్థిమితం లేని యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇపుడు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మలపూడిలో మరో మహిళ సామూహిక అత్యాచారనికి గురైంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తుమ్మలపూడి చెందిన వీరంకి తిరుపతమ్మ (35) అనే మహిళ పొలాలకు నీళ్లు పెట్టే పైపులను అద్దెకిస్తూ జీవనం సాగిస్తుంది. ఆమె భర్త శ్రీనివాస రావు పనుల కోసం తిరుతికి వెళ్లారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 
ఈ నేపథ్యంలో ఆమె తన ఇంట్లో విగతజీవిగా పడివుండటాన్ని ఇరుగుపొరుగువారు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. తిరుపతమ్మ మృతదేహంపై గోళ్ళతో రక్కిన గాయాలు, కొరికిన గాట్లు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. 
 
పైగా, ఆమె శరీరంపై దుస్తులు లేకపోవడంతో ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం జరిపినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తిచారు. దీనికి సంబంధిచిన ఆధారాలను కూడా క్లూస్ టీమ్ సేకరించింది.
 
ఆ తర్వాత మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహానికి శవపరీక్ష చేయగా, అత్యాచారానికి గురైనట్టు తేలింది. అయితే, తిరుపతమ్మను తెలిసినవారిలో కొందరు కలిసి అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. 
 
సంఘటనాస్థలంలో నిందితులు తాగిపడేసిన మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అత్యాచారానికి పాల్పడి మహిళను హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం దుగ్గిరాల మండల కమిటీ కార్యదర్శి జెట్టి బాలరాజు, నాయకులు వి.సాంబశివరావు డిమాండ్ చేశారు. 
 
హత్యకు ముందు తిరుపతమ్మపట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించినట్లు ఆమె శరీరంపై ఉన్న గాయాలను బట్టి అర్థమవుతోందని, ఇటువంటి వారిని క్షమించకూడదని వారు డిమాండ్ చేశారు. నిందితులకు కఠినశిక్ష పడేలా చేయడం ద్వారా మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.100 నుంచి రూ.150 పలుకుతున్న మామిడి పండ్లు