Webdunia - Bharat's app for daily news and videos

Install App

ల‌క్ష డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు చూపిస్తా: మంత్రి త‌ల‌సాని

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (17:35 IST)
ల‌క్ష డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు చూపిస్తాన‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. న‌గ‌రంలోని జియ‌గూడ‌, గోడికేక‌బీర్, ఇందిరాగాంధీ కాల‌నీ, బ‌న్సీలాల్‌పేట, క‌ట్టెల‌మండిలో నిర్మించిన డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను భ‌ట్టి విక్ర‌మార్క‌కు మంత్రి త‌ల‌సాని, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ క‌లిసి చూపించారు.

అనంత‌రం మంత్రి త‌ల‌సాని మీడియాతో మాట్లాడుతూ.. పేద వ‌ర్గాలు గొప్ప‌గా బ‌త‌కాల‌నే ఉద్దేశంతోనే సిఎం కెసిఆర్‌ ఈ ప‌థ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నార‌ని తెలిపారు. డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌కే కేటాయిస్తున్నామ‌ని చెప్పారు. ఈ ఇండ్ల‌ను సిఎం కెసిఆరే డిజైన్ చేశార‌ని గుర్తు చేశారు. హైద‌రాబాద్‌లో మొత్తం 60 ప్రాంతాల్లో ఇండ్లు నిర్మిస్తున్నామ‌ని తెలిపారు.

ఇవాళ చూసింది చాలా త‌క్కువ అని తెలిపారు. భార‌త‌దేశ చ‌రిత్ర‌లో ఎన్నడూ లేని విధంగా రాష్ర్ట ప్ర‌భుత్వం డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నామ‌ని చెప్పారు. ఒక్కో ఇంటి విలువ రూ. కోటి వ‌ర‌కు ఉంటుంద‌న్నారు. డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేకుండా నిర్మిస్తున్నామ‌ని చెప్పారు. ల‌క్ష ఇండ్ల నిర్మాణాల కోసం ప్ర‌భుత్వం రూ. 10 వేల కోట్లు ఖ‌ర్చు పెడుతుంద‌న్నారు.

కొల్లూరులో 15 వేల ఇండ్లు నిర్మించాం. అవి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. వీలైనంత త్వ‌ర‌గా ఈ ఇండ్ల‌ను పూర్తి చేసి పేద‌వారికి పంపిణీ చేయాల‌ని ప్ర‌భుత్వం ముందుకెళ్తుంది. ల‌బ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments