Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉంగరానికి ఓటు వేస్తే.. మునుగోడు అమెరికా అయిపోతుంది : కేఏ పాల్

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (10:41 IST)
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల మూడో తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం బరిలో ఉన్న అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే, తమతమ పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆయా పార్టీల అధినేతలు కూడా మునుగోడులో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేసిన ప్రజా గాయకుడు గద్దర్‌కు మద్దతుగా ఆ పార్టీ అధినేత కేఏ పాల్ విసృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా, ఆయన బుధవారం ఓ హెటల్‌లో దోశ వేస్తూ కనిపించారు. చేతులతో దోశను కాలుస్తూనే...అక్కడున్న వారితో ఆయన మాట్లాడారు. 
 
ఈ ఎన్నికల్లో తనకు ఉంగరం గుర్తును కేటాయించారని చెప్పిన పాల్... ఉంగరం గుర్తుకు ఓటేస్తే మునుగోడును అమెరికా మాదిరిగా మారుస్తానని ఆయన చెప్పారు. 'ఉంగరం గుర్తుకు ఓటేయండి... మునుగోడును అమెరికా చేసి పారేద్దాం' అంటూ ఆయన తనదైన స్టయిల్లో చెప్పారు. ఓ వైపు పాల్ మాట్లాడుతుండగానే... ఆయన మాటలకు కౌంటర్లు ఇస్తూ జనం కూడా ఉత్సాహం చూపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments