Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మునుగోడు ఉప ఎన్నికలు : ప్రజాశాంతి పార్టీలో చేరిన గద్దర్

gaddar ka paul
, బుధవారం, 5 అక్టోబరు 2022 (20:28 IST)
ప్రజా గాయకుడు గద్దర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు  కేఏ పాల్ సారథ్యంలోని ప్రజాశాంతి పార్టీలో గద్దర్ చేశారు. ఈయన త్వరలోనే మునుగోడులో జరుగనున్న ఉప ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదేసమయంలో కేఏ.పాల్ చేపట్టిన ఆమరణ దీక్షను సైతం విరమించుకున్నారు. 
 
నవంబర్ మూడో తేదీన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంమది. ఈ ఉప ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగనున్నారు. గురువారం నుంచి మునుగోడులో ఇంటింటి ప్రచారం చేస్తానని గద్దర్ తెలిపారు. మ‌రోవైపు ఈ నెల 2న పీస్ మీటింగ్‌కు పోలీసులు అనుమ‌తి నిరాకరించడాన్ని నిరసిస్తూ చేస్తున్న ఆమరణ దీక్షను కేఏ పాల్ విర‌మించారు. ఆయ‌న‌కు గ‌ద్ద‌ర్ నిమ్మ‌రసం ఇచ్చి దీక్ష విర‌మింపజేశారు.  
 
కాగా, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం పోరాటం చేసే గ‌ద్ద‌ర్ త‌న పాట‌ల‌తో తెలంగాణ స‌మాజాన్ని ఎంతో చైత‌న్యప‌రిచారు. తెలంగాణ ఉద్య‌మంలో సైతం ఆయ‌న పాట‌లు ఎంతో మందిలో స్ఫూర్తిని ర‌గిలించాయి. అయితే, ఆ మ‌ధ్య ఆయ‌న ఆలోచ‌నా విధానంలో మార్పు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. 
 
గ‌తంలో ఎప్పుడూ ఓటు హ‌క్కు వినియోగించుకోని గ‌ద్ద‌ర్ ఈ మ‌ధ్య ఓటు వేశారు. అలాగే, హైద‌రాబాద్ నగరంలో జ‌రిగిన న‌రేంద్ర మోదీ బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రై అంద‌రినీ ఆశ్చ‌ర్యప‌రిచారు. అలాగే, గాంధీ భ‌వ‌న్‌కు కూడా వెళ్లి, తెరాస నేతలతో కూడా సమావేశమయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కెఎఫ్‌సి యొక్క ఇటీవలి చిత్రం 'క్షమత'లో, 'లేదు' అనే పదాన్ని వినని ఒక అమ్మాయి ఇష్మీత్