Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌‌లోనే వుంటే ఎలా..? వారానికి రెండుసార్లు ఆఫీసుకు రండి..

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (09:56 IST)
కరోనా కారణంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో ఉన్నవారిని ఒకేసారి కాకుండా బృందాల వారిగా కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిందిగా ఆదేశిస్తున్నాయి ఐటీ కంపెనీలు. 
 
ఈ క్రమంలోనే ఇప్పటికే హైదరాబాద్‌లోని చాలా వరకు ఐటీ కంపెనీల కార్యాలయాలు కొవిడ్‌ పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం ఉద్యోగులతో కళకళలాడుతున్నాయి. 
 
దీంతో హైదరాబాద్‌ నగరంలో ఐటీ పరిశ్రమపై పరోక్షంగా ఆధారపడ్డ ట్రాన్స్‌పోర్ట్‌, హోటల్‌ తదితర రంగాలకు చెందిన వెండార్లకు మంచి రోజులు వచ్చినట్లు ఆయా రంగాలకు చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు.
 
నిజానికి ఈ ఏడాది జనవరి నుంచి ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేయించాలని కంపెనీలు నిర్ణయించినప్పటికీ ఆ సమయంలో థర్డ్‌వేవ్‌ రావడంతో వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీసుకు కంపెనీలు తాత్కాలికంగా బ్రేక్‌ ఇచ్చాయి. థర్డ్‌వేవ్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. 
 
అనంరతం కొవిడ్‌ కేసులు పెరిగినప్పటికీ వ్యాక్సినేషన్‌ పూర్తవడంతో వైరస్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోతోందని నిర్ధారణకు వచ్చిన కంపెనీలు ఉద్యోగులను శాశ్వత ప్రాతిపాదికన ఆఫీసులకు పిలిపిస్తున్నాయి. 
 
అయితే వారంలో మూడు రోజులు ఇంటి నుంచి మిగిలిన 2 రోజులు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటును ఉద్యోగులకు కంపెనీలు కలిగిస్తున్నాయి. 
 
దీంతో ప్రస్తుతం వర్క్‌ఫ్రమ్‌హోమ్‌లో ఉన్న ఉద్యోగులు ఆఫీసుల నుంచి పనిచేయడానికి స్వచ్ఛంధంగా ముందుకు వస్తున్నట్లు ఐటీ కంపెనీల హెచ్‌ విభాగాల సీనియర్‌ అధికారులు పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అనే ట్యాగ్‌లైన్‌ తో అనుష్క శెట్టి ఘాటి సిద్ధమవుతోంది

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments