Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడితే మనం రాద్దాంతం చేయడమెందుకు : ఆర్ఆర్ఆర్

raghurama krishnaraju
, బుధవారం, 10 ఆగస్టు 2022 (07:57 IST)
ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరచాలనంపై వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకొచ్చిన నష్టమేమిటని ఆయన అన్నారు. పైగా, దీనిపై రాద్దాంతం చేయడం ఏమాత్రం భావ్యం కాదని హితవు పలికారు.
 
మోడీ - బాబు కరచాలనంపై రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, మోడీ, బాబు మధ్య కరచాలన భేటీ కేవలం 5 నిమిషాలు మాత్రమే జరిగింది. దీనిపై తమ పార్టీ నేతలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. 
 
ప్రధానితో తమ సీఎం గంటసేపు కలిసి భోజనం చేశారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రధానమంత్రి మధ్యాహ్న భోజనం 10-15 నిమిషాల్లో ముగిస్తారన్నారు. మధ్యాహ్న భోజన సమయంలో సీఎం జగన్‌ ఆయనతో కలిసున్నా దూరంగా కూర్చున్నారని తెలిపారు. 
 
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 30-35 స్థానాలకు మించి గెలిచే అవకాశాలు లేవన్నారు. తెలంగాణలో తెదేపాతో భాజపా జతకట్టే అవకాశాలున్నట్లు కనిపిస్తోందని అన్నారు. గోరంట్ల మాధవ్‌ వీడియో మార్ఫింగ్‌ చేశారనే విషయం ఎలా తెలుస్తుందన్నారు. సకలశాఖా మంత్రి తన విశాల హృదయాన్ని చాటుకుంటూ నాలుగు గోడల మధ్య వ్యవహారానికి ఇంత రాద్ధాంతం ఏమిటని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఆర్ఆర్ఆర్ వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీలు చూసుకుని ఢిల్లీకి రమ్మన్నారు : మోడీ కరచాలనంపై బాబు వివరణ