Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపరిచితుల ఫోన్‌ వస్తే వెంటనే మాకు సమాచారమివ్వండి: సైబరాబాద్‌ పోలీసులు

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (10:27 IST)
ప్రజలు సైబర్‌ నేరాల బారిన పడి మోసపోకుండా ఉండటానికి సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు  వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ల గురిం చి ఆరా తీయడానికి, నిజానిజాలు తెలసుకోవడానికి సైబర్‌ క్రైమ్‌ విభాగంలో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు.

ప్రజల నుంచి వచ్చే ఫోన్లు రిసీవ్‌ చేసుకోవడానికి, అనుమానాలను నివృత్తి చేయడానికి ఒక ల్యాండ్‌లైన్‌, మరొక మొబైల్‌తో హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు. సైబర్‌ క్రైమ్‌పై అవగాహన ఉన్న సిబ్బందిని ఉదయం 9:00 నుంచి రాత్రి 8:00 వరకు ప్రజలకు అందుబాటులో ఉంచారు.

ప్రజల నుంచి వచ్చే ఫోన్లను రిసీవ్‌ చేసుకొని వారి అనుమానాలను నివృత్తి చేస్తారు. తద్వారా ప్రజలు సైబర్‌ నేరాల బారినపడకుండా, నేరగాళ్ల చేతికి చిక్కి రూ. లక్షల్లో నష్టపోకుండా ముందుగానే నివారించొచ్చు.

ఈ మేరకు ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్లను సైబర్‌ క్రైమ్‌ విభాగం వారు సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఫోన్‌లోనే కాకుండా.. నెటి జన్లు ఆన్‌లైన్‌లో కూడా సంప్రదించి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.
 
సంప్రదించాల్సిన  ఫోన్‌ నంబర్‌లు..
మొబైల్‌ నంబర్‌- 9490617310
ల్యాండ్‌లైన్‌ - 04027854031
sho-cybercrimes@tspolice.gov.in
NCR Portal:https://cybercrime.gov.in

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments