Webdunia - Bharat's app for daily news and videos

Install App

విందుకు ఇంటికి పిలిచి.. యువతిని వేధించిన ఉపాధ్యాయులు

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (11:19 IST)
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో ఇద్దరు కామాంధ ఉపాధ్యాయులపై పోలీసులు కేసు నమోదు చేశారు ఓ యువతిని తమ ఇంటికి విందుకు ఆహ్వానించారు. ఆ తర్వాత ఆ యువతిని లైంగికంగా వేధించారు. ఆ కామాంధుల చెర నుంచి తప్పించుకున్న యువతి నేరుగా పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ కామాంధ ఉపాధ్యాయులపై కేసు నమోదైంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, అల్వాల్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి రాంనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. మాదాపూర్‌లోని చంద్రనాయక్‌ తండాలో నివాసముంటున్న కల్యాణ్‌ వర్మ ఇదే కళాశాలలో వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాడు. 
 
తన ఇంట్లో విందు ఉందని చెప్పి కల్యాణ్‌వర్మ్‌ సదరు యువతిని గత నెల 29న సాయంత్రం ఆహ్వానించాడు. అయితే తన సోదరుడితో కలిసి విద్యార్థిని వైస్‌ ప్రిన్సిపల్‌ ఇంటికి వచ్చింది. సోదరుడిని బయట ఉండమని చెప్పి ఇంట్లోకి వెళ్లిన యువతితో కాసేపు మాట్లాడిన తర్వాత కల్యాణ్‌వర్మ, అక్కడే ఉన్న మరో అధ్యాపకుడు రవీందర్‌ అనుచితంగా ప్రవర్తించి లైంగికంగా వేధించారు. 
 
వారి నుంచి తప్పించుకొని బయటకు పారిపోయిన యువతి ఈ నెల 9న రాత్రి మాదాపూర్‌ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తన దృష్టికి రాగానే ఇద్దరినీ ఉద్యోగం నుంచి తొలగించినట్టు కళాశాల డైరెక్టర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం