Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా.. పది నెలలు మూతపడిన షాపు.. తెరిస్తే బాక్సులో అస్థిపంజరం

కరోనా.. పది నెలలు మూతపడిన షాపు.. తెరిస్తే బాక్సులో అస్థిపంజరం
, గురువారం, 11 ఫిబ్రవరి 2021 (22:11 IST)
Skeleton
కరోనాతో పది నెలల పాటు వాణిజ్య సముదాయాలు తొలినాళ్లలో మూసివేశారు. తర్వాత దాదాపు అన్నింటినీ తెరిచారు. కానీ హైదరాబాద్ నడిబొడ్డున ఓ షాపు మాత్రం ఓపెన్ చేయలేదు. అలా అని రెంట్ కూడా కట్టడం లేదు. దీంతో యాజమానులు అయినా ప్రార్థనా మందిరం నిర్వహకులు ధైర్యం చేసి ఓపెన్ చేశారు. అయితే అందులో ఓ బాక్స్ కనిపించింది. అందులో చూస్తే పుర్రె, ఎముకలు బయటపడ్డాయి.
 
ప్రార్థన మందిరానికి చెందిన షాపును అద్దెకు ఇచ్చారు. లాక్ డౌన్ కన్నా ముందే వ్యాపారం సజావుగా సాగేది. కానీ తర్వాత మూసివేశారు. పది నెలల పాటు మూసివుంచిన ఆ షాపును ఓపెన్ చేయగా.. అందరూ షాక్ తిన్నారు. ఆ షాపులోని ఓ బాక్సులో అస్థిపంజరం కనిపించింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు. 
 
ప్రార్థన మందిరానికి చెందిన షాపు నిర్వహకులను ప్రశ్నించారు. ఏ చిన్న అనుమానం వచ్చినా సరే.. అందరినీ ప్రశ్నిస్తున్నారు. ఆ అస్థిపంజరం ఎవరిదో తెలియదని.. విచారణలో తెలిసే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్షుద్రపూజల కోసం నరబలి ఇచ్చారా..? అనంతలో కలకలం