Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు, ఆపై కోర్కె తీర్చుకుని హత్య చేస్తాడు

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (12:18 IST)
మహిళలపై 18 హత్య కేసులతో పాటు ఇతర నేరాలతో సంబంధం ఉన్న 45 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని అరెస్టుతో, ఇటీవల మహిళలపై రెండు హత్య కేసులు ఛేదించినట్లయింది. రాళ్లను కోసే వృత్తిని జీవనోపాధిగా సాగిస్తున్న ఈ వ్యక్తిని నగర పోలీసు టాస్క్ ఫోర్స్, రాచకొండ కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు.
 
కాగా ఇంతకుముందే ఇతడిని 21 కేసులలో అరెస్టు చేశారు, వీటిలో 16 హత్య కేసులు, నాలుగు ఆస్తి నేరాలున్నాయి. ఇతడికి 21 సంవత్సరాల వయస్సులో వివాహమైంది. ఐతే వివాహమైన కొద్దిరోజులకే అతడి భార్య మరో వ్యక్తితో లేచిపోయింది. దాంతో మహిళలపై అతడు పగను పెంచుకున్నాడు.
 
అలా 2003లో తన నేర కార్యకలాపాలను ప్రారంభించాడు. డబ్బుకోసం ఇబ్బందులు పడే ఒంటరి మహిళలే ఇతడి టార్గెట్. వారికి డబ్బు సాయం చేసినట్లు చేసి మెల్లగా లైంగికంగా వారిని వశపరుచుకుంటాడు. కోర్కె తీరిన తర్వాత వారిని హత్య చేసేస్తాడు. తనతో వున్నప్పుడు తను హత్య చేయాల్సిన మహిళకు కూడా మద్యం పోసి లైంగికంగా వశం చేసుకుంటాడు. ఆ తర్వాత హత్య చేసి, ఆమె ఇంట్లో వున్న విలువైన వస్తువులను తీసుకున పారిపోతాడని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకూ అతడి చేతులో 18 మంది మహిళలు హతులయ్యారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం