ఎమ్మార్వో కార్యాలయానికి తాళం వేసిన వృద్ధురాలు .. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (13:01 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఓ వృద్ధురాలు ఒక ఎమ్మార్వో కార్యాలయానికి తాళం వేసింది. కార్యాలయ అద్దె చెల్లించమని కొన్ని నెలలుగా మొత్తుకున్నప్పటికీ అధికారులు స్పందించలేదు. దీంతో విసిగిపోయిన ఇంటి యజమానురాలు కార్యాలయానికి తాళం వేసింది. 
 
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో జరిగింది. ఈ మండలానికి చెందిన చంద్రమణి అనే మహిళ తన ఇంటిని ఎమ్మార్వో కార్యాలయానికి అద్దెకు ఇచ్చారు. ఆరంభంలో సజావుగానే అద్దె చెల్లిస్తూ వచ్చిన అధికారులు ఆ తర్వాత చెల్లించడం మానేశారు. దీంతో అద్దె చెల్లించాలని ఆమె కార్యాలయ అధికారులు చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరగింది. 
 
కానీ, వారు మాత్రం కనికరించలేదు. దీంతో విసుగు చెందిన చంద్రమణి.. మంగళవారం ఎమ్మార్వో కార్యాలయానికి ఏకంగా తాళం వేసింది. అద్దె చెల్లించేంత వరకు తాళం తీసే ప్రసక్తే లేదని భీష్మించుకూర్చొంది. ఇప్పటివరకు మొత్తం రూ.7,37,00 అద్దె చెల్లించాలని ఆమె వాపోయింది. ప్రభుత్వ అధికారులే ఇలా చేస్తే ఇంటి యజమానులు ఎవరికి చెప్పుకోవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments