మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ కన్నుమూత

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (14:20 IST)
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ కన్ను ముశారు. నల్గొండ జిల్లా చలకుర్తి నియోజకవర్గానికి 1994 నుంచి 1999 వరకు శాసనసభ్యునిగా సేవలు అందించారు.

నాగార్జున సాగర్ (చలకుర్తి) మాజీ ఎమ్మెల్యే, తెరాస నేత గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి మృతి చెందారు. 1994-99 మధ్య చలకుర్తి తెదేపా ఎమ్మెల్యేగా రామ్మూర్తి యాదవ్ పని చేశారు.

అంత్యక్రియలు త్రిపురారం మండలం పెద్ద దేవులపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జీవిత ప్రస్థానం 1947 అక్టోబర్ 26 న గుండెబోయిన మట్టయ్య, మహా లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. 1981లో పెద్ద దేవులపల్లి గ్రామ సర్పంచ్​గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.

ఎన్టీఆర్​కు అత్యంత సన్నిహితులు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ఉద్యమ నాయకునిగా ఉన్న కేసీఆర్ సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా అందరికి అజాత శత్రువుగా పేరు సంపాందించారు. ఆయన మృతికి ప్రజాప్రతినిధులు, నేతలు నివాళులు అర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఆసక్తికర సన్నివేశాలు.. మహేష్ క్లారిటీ (video)

Suriya: ఎమోషనల్ డ్రామాగా సూర్య నటించిన విశ్వనాథ్ & సన్స్ టీజర్

Anand Deverakonda: ఎపిక్ మూవీ ప్రోమో - రావులపాలెంలో ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు

Priyadarshi: సుయోధన క్యారెక్టర్ సాయికుమార్ గారినే అనుకున్నా : వై ఎస్ మాధవ్ రెడ్డి

Chadalavada: పొడ్రూసర్స్ గిల్డ్‌ విషపురుగు, ఇండస్ట్రీకి చిన్న నిర్మాతలే ముఖ్యం : చదలవాడ శ్రీనివాసరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కోసం సైన్స్-పరిశోధనలను ముందుకు తీసుకెళ్లాలి: డాక్టర్ అంజిరెడ్డి స్మారక ఉపన్యాసం

శరీర బరువు పెరిగితే వచ్చే వ్యాధులు ఏమిటి?

ఇలా చేస్తే మూత్రపిండాలు ఆరోగ్యంగా వుంటాయి

శరీర మర్దనకు ఎలాంటి నూనెలు వాడాలి?

పొట్ట మసాజ్, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments