Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్మశానవాటికను శుభ్రం చేసిన ఎమ్మెల్యే

Advertiesment
శ్మశానవాటికను శుభ్రం చేసిన ఎమ్మెల్యే
, సోమవారం, 9 సెప్టెంబరు 2019 (08:04 IST)
పాలకొల్లు పట్టణం హిందూ స్మశాన వాటికలో పారిశుధ్య పై అధికారులు సరైన చర్య తీసుకోక పోవడంతో  తానే స్వయంగా శుభ్రం చేశారు పాలకొల్లు శాసన సభ్యులు డా. నిమ్మల రామానాయుడు.

ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. దేవాలయంగా మార్చిన స్మశాన వాటికను పరిశుభ్రతను కాపాడుటలోను, పర్యవేక్షణలోను అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని అన్నారు.
 
మున్సిపల్, టూరిజం, వంటి వివిధ శాఖల ద్వారా కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసిన కైలాసవానం, చంద్రబాబునాయుడు ఉద్యానవనం, అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, ఎన్టీఆర్ కళా క్షేత్రం , అంబెడ్కర్ భవనం వంటి నిర్మాణాలు నిలిచిపోవడమీ కాక, పర్యవేక్షణ కొదవవడంతో మళ్ళి పూర్వపు  పరిస్థితికి చేరు వవుతున్నాయని నిమ్మల అన్నారు. 
 
శాసన సభ్యులు తలమీద తట్టపెటుకున్న రోజే అధికారులు, పురపాలక కార్మికులు వస్తున్నారని లేని పక్షంలో అట్లనే ఉంటుందని అన్నారు. ఇలానే వదిలేస్తే మళ్ళి పూర్వపు స్థితి వచ్చి కాలు పెట్టలేని స్థితి స్మశాన వాటికలో నెలకొంటుందని, ఇప్పటికి స్పందించకపోతే ప్రతి వారం స్మశాన వాటికలో పని చేస్తానని, అప్పటికి స్పందించకపోతే కమిషనర్ ఇంటి దగ్గరకుడా పని చేస్తానని డా.నిమ్మల తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో టీడీపీ కేడర్ తో బాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. గత 3 నెలలుగా పరిస్థితి చక్కదిద్దామని అధికారుల దృష్టికి, కమిషనర్ దృష్టికి తీసుకువస్తున్న స్పందన లేకపోవడంతో శాసన సభ్యులు డా.నిమ్మల స్వయంగా రంగంలోకి దిగి స్మశాన వాటికను శుభ్రం చేసారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళ వేధింపులు... గ్రామ వలంటీరు ఆత్మహత్య