Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్తను చంపకుంటే నువ్వు నావద్దకు వద్దు... ప్రియుడికి వార్నంగ్... ఏం జరిగింది?

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (21:51 IST)
వివాహేతర సంబంధాలు ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. క్షణికావేశంలో ప్రాణాలను తీసేస్తున్నారు.. ప్రాణాలను తీసుకుంటున్నారు. గాఢంగా ప్రేమించిన భర్త తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని అతిదారుణంగా హత్య చేయించింది ఓ భార్య.
 
హైదరాబాద్ లోని ఓల్డ్ బోయనిపల్లి ప్రాంతంలో నివాసముంటున్నారు షాహినా, బహదూర్. వీరిద్దరు 8 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. బహూదూర్, షాహినాలు హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవారు. బహదూర్ ఎప్పుడూ తన పనేదో తానే చేసుకుంటూ ఉండేవాడు. ఎవరిని పట్టించుకోడు. షాహినానే బహదూర్‌ను ప్రేమించింది. పెళ్ళి ప్రపోజల్ పెట్టింది. 
 
బహదూర్‌తో పెళ్ళి కూడా జరిగిపోయింది. ఆరు నెలల పాటు వీరి కాపురం బాగానే సాగింది. అయితే ఇంట్లో నీరు రాకపోవడంతో ప్లంబర్ పని కోసం కాశీ అనే యువకుడిని పిలిచారు. పని పూర్తి చేసుకుని వెళుతున్న సమయంలో షాహినాతో మాటలు కలిపాడు కాశీ. అది కాస్తా అలాఅలా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్తకు తెలియకుండా రెండు నెలల పాటు ఆ సంబంధం కొనసాగింది. 
 
మరోవైపు భర్త నుంచి ఆశించిన శారీరక సుఖం లేకపోవడంతో ఇక తన భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అతన్ని చంపేద్దామని ప్రియుడు కాశీకి సలహా ఇచ్చింది షాహినా. ఆమె మాటలకు షాకైన కాశీ... వద్దని చెప్పే ప్రయత్నం చేశాడు. అలాగైతే నువ్వు నాకొద్దంటూ గొడవకు దిగింది షాహినీ. దీంతో చేసేది లేక కాశీ తన ఇద్దరు స్నేహితులతో కలిసి మర్డర్‌కు ప్లాన్ చేశాడు. ఇంటిలో బహదూర్ నిద్రిస్తున్న సమయంలో తన స్నేహితులను పిలిపించుకుని దిండుతో గాలి ఆడకుండా చేసి బహదూర్‌ను చంపేశారు.
 
తెల్లవారుజామున షాహినా, బహదూర్ తమ్ముడు ఆసిఫ్‌‌కు ఫోన్ చేసి మీ అన్న గుండెపోటుతో చనిపోయాడని చెప్పింది. బంధువులకు అలాగే చెప్పి నమ్మించింది. అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే ఆసిఫ్‌కు వదిన వాలకంపై అనుమానం వచ్చింది. బహదూర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని పోలీసులను కోరాడు. పోస్టుమార్టంలో బహదూర్ గుండెపోటుతో చనిపోలేదని, గొంతు నులిమి చంపేశారని తేలింది. దీంతో షాహినాను పోలీసులు విచారిస్తే అసలు విషయం బయటపడింది. నిందితులు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments