Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 30 April 2025
webdunia

బాత్రూంలో ఆమె కాలు జారింది... అలా మొదలైంది... కానీ స్నేహితుడు బలయ్యాడు...

Advertiesment
Extra marital Affair
, బుధవారం, 14 ఆగస్టు 2019 (17:15 IST)
అది తూర్పుగోదావరిజిల్లా కాకినాడ. పార్క్ నుంచి ఒకటే అరుపులు. వాకింగ్ చేస్తూ ఒక యువకుడు మృతదేహాన్ని చూశాడు. చుట్టు రక్తపు మరకలు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. సర్ ఇక్కడో మృతదేహం ఉందని. అరగంటలో పోలీసులొచ్చారు. మృతదేహాన్ని పరిశీలించారు. అతని జేబులో సెల్ ఫోన్ ఉంది. 
 
ఆ సెల్ ఆధారంగా ఇన్వైస్టిగేషన్ ప్రారంభించారు పోలీసులు. మృతుడి ఫోన్లో నుంచి లాస్ట్ కాల్‌కు ఫోన్ చేశారు. అతని పేరు వేణు. మృతుడి స్నేహితుడు. నేను ఇన్సెపెక్టర్‌ని మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి పార్క్ దగ్గర మృతి చెందాడు. అతని ఫోన్లో నీ నెంబర్ డయల్ లిస్ట్‌లో చివరలో ఉంది. విచారణకు రావాల్సి ఉంటుందన్నాడు.
 
దీంతో వేణు స్టేషన్‌కు వెళ్ళాడు. చనిపోయిన వ్యక్తి పేరు సతీష్, క్యాబ్ డ్రైవర్ సర్. అతను నా స్నేహితుడంటూ వేణు చెప్పాడు. అయితే రెండురోజుల క్రితం అతన్ని కలిశాను. మళ్ళీ కలవలేదు అంటూ చెప్పే ప్రయత్నం చేశాడు. పోలీసులకు అనుమానం వచ్చింది. నిజం చెబుతావా.. చెప్పించమంటావా అన్నారు.
 
ఇంకేముంది నిజం చెప్పడం ప్రారంభించాడు వేణు. తనకు పెళ్ళై మూడు సంవత్సరాలవుతోందని చెప్పాడు వేణు. తను ఒక బట్టల దుకాణాన్ని నడుపుతున్నానని, అక్కడే క్యాబ్ డ్రైవర్ సతీష్‌ పరిచయం అయ్యాడని చెప్పాడు. గత నాలుగు నెలల నుంచి మంచి స్నేహితులుగా తాము ఉన్నామని.. అయితే సతీష్‌ను చంపడానికి బలమైన కారణం కూడా ఉందని చెప్పాడు.
 
తమ బట్టల షాపుకు ఓసారి ధనలక్ష్మి అనే వివాహిత వచ్చింది. ఆమె తన భర్తకు బట్టలు తీసుకుని వెళ్ళింది. వెళ్ళేటప్పుడు తన పర్సు మర్చిపోయింది. అయితే పర్సులో ఆమె మొబైల్ నెంబర్ ఉంది. దాన్ని చూసి ఫోన్ చేశాను. ఇంటి అడ్రస్ చెప్పింది. ఇంటికి వెళ్ళి బ్యాగ్ ఇచ్చాను. టీ తాగి వెళ్ళండని బలవంతం చేసింది. తన భర్త క్లాస్-1 కాంట్రాక్టర్ అని వారానికి ఒకసారి మాత్రమే ఇంటికి వస్తారని చెప్పుకొచ్చింది.
 
టీ తాగుతు వుండగా అవి ఒలికి నా బట్టలపై పడ్డాయి. దాంతో వాష్ చేసుకోండని బాత్రూంకు తీసుకెళ్ళింది ధనలక్ష్మి. బాత్రూం తలుపు తీసి కొళాయి తిప్పి బయటకు వస్తుండగా ఆమె కాలు జారింది. నేను గట్టిగా పట్టుకున్నాను. అలా మామధ్య శారీరక సంబంధం ప్రారంభమైంది. అలా రెండునెలలు బాగానే మామధ్య సంబంధం సాగింది. 
 
అయితే షాపు మూసిన తరువాత నేను ఎక్కువసేపు సతీష్‌తోనే మాట్లాడుతూ ఉండేవాడిని. నేను అతను కలిసి ధాబాకు వెళ్ళేవాళ్ళం. అయితే ధనలక్ష్మితో పరిచయం వల్ల అతనితో కలవడం తగ్గించా. విషయం కాస్త మెల్లగా సతీష్‌కు తెలిసింది. నన్ను ఆటపట్టించడం ప్రారంభించాడు. ఒకసారి మార్కెట్లోకి నా భార్యను తీసుకుని వెళ్ళినప్పుడు.. ఏంటి... నిజం చెప్పేయమంటావా అంటూ హేళనగా మాట్లాడాడు. దీంతో నాకు చిర్రెత్తుకొచ్చింది. 
 
గొడవ వద్దని అక్కడి నుంచి వచ్చేశాను. నా భార్యకు నాపై అనుమానం వచ్చింది. ఎలాగోలా సర్ది చెప్పాను. కానీ సతీష్ మాత్రం నన్ను హేళనగా మాట్లాడటం మానలేదు. దీంతో అతన్ని చంపేయాలనుకున్నాను. నా షాపులో పనిచేసే కాశిని వెంటపెట్టుకుని సతీష్‌ని తీసుకెళ్ళి రాత్రివేళ పార్కుకు వెళ్ళాం. పూటుగా మద్యం తాగాం. వద్దంటున్నా సతీష్‌కు పీకలదాకా నేనే తాగించా. నేను, కాశి కలిసి సతీష్‌ను చంపేశామని చెప్పాడు నిందితుడు వేణు. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త బజాజ్ పల్సర్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు.. అందుబాటులోకి ధర?