Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గర్భిణీ యువతిపై సామూహిక అత్యాచారం.. ప్రేమికుడి కళ్లముందే ఘోరం..

Advertiesment
గర్భిణీ యువతిపై సామూహిక అత్యాచారం.. ప్రేమికుడి కళ్లముందే ఘోరం..
, మంగళవారం, 13 ఆగస్టు 2019 (18:31 IST)
రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. ప్రేమికుడిపై దాడి చేసి గర్భిణీ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్, బన్స్‌వారా జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువతి, అదే ప్రాంతానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ శారీరకంగా కలవడంతో ఆ యువతి గర్భం దాల్చింది. 
 
ఈ నేపథ్యంలో జూలై 13వ తేదీ రాత్రి ఇద్దరూ గ్రామానికి బైకులో వెళ్తుండగా, వారిని కొందరు దుండగులు అడ్డుకున్నారు. ఆపై ప్రేమికుడిపై దాడికి పాల్పడి, గర్భిణి అయిన యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఆపై అక్కడే ఆ యువతిని వదిలిపెట్టి పారిపోయారు. ఈ దుశ్చర్యతో ఆ యువతికి గర్భస్రావం అయ్యింది. ప్రేయసిని కాపాడలేని దుస్థితికి చేరిన ఆ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
అయితే తనపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి ఆ యువతి ఎవరికి చెప్పకుండా దాచేసింది. కానీ ప్రియుడి ఆత్మహత్యపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు చేపట్టిన దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెరు వంతెనపై ముద్దుల్లో మునిగి ప్రాణాలు కోల్పోయిన ప్రేమజంట (Video)