Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ డ్రగ్స్ కేసు : కీలక సూత్రధారి అరెస్టు

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (16:56 IST)
హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ సరఫరా కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్‌ను నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. గోవా నుంచి హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసులో ఎడ్విన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను శనివారం సాయంత్రం హైదరాబాద్ నగరానికి తీసుకునిరానున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నారాయణ బోర్కర్‌ను నార్కోటిక్ విభాగం పోలీసులు గత మూడు నెలల క్రితం అరెస్టు చేసి విచారించారు. ఈ విచారణలో ఎడ్విన్ పేరును బహిర్గతం చేశాడు. బోర్కర్ ఇచ్చిన సమాచారంతో గోవాలో ఎడ్విన్‌పై నార్కోటిక్ విభాగం పోలీసులు నిఘా ఉంచారు. గత మూడు నెలలుగా సాగుతున్న ఈ నిఘాలో పోలీసుల కన్నుగప్పి ఎడ్విన్ తప్పించుకుని తిరుగుతున్నారు. 
 
ఈ క్రమంలో గత 15 రోజులుగా గోవాలోనే మకాం వేసిన నార్కోటిక్ పోలీసులు ఎడ్విన్ కదలికలపై నిఘా వేసి అరెస్టు చేశారు. గోవా నుంచి శనివారం రాత్రికి హైదరాబాద్ నగరానికి తీసుకునిరానున్నారు. కాగా, దేశ వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరాలో ఎడ్విన్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments