Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నేటి నుంచి వృద్ధులకు కరోనా టీకాలు

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (07:44 IST)
తెలంగాణా రాష్ట్రంలో నేటి నుంచి వృద్ధులకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. వృద్ధులతో పాటు 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా టీకా వేయనున్నారు. కొవిన్ 2.0 యాప్‌లో సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదు చేసుకున్న వారికి ఎంపిక చేసుకున్న టీకా కేంద్రాల్లో టీకాలు వేయనున్నట్టు చెప్పారు.
 
ఈ దశలో మొత్తం 50 లక్షల మందికి టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలివారం మాత్రం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి మాత్రమే టీకా వేస్తారు. కార్యక్రమం సాఫీగా సాగితే టీకా కేంద్రాలకు నేరుగా వచ్చే వారికి కూడా టీకా వేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
 
తొలి రోజు రాష్ట్రవ్యాప్తంగా 48 ప్రభుత్వ, 45 ప్రైవేటు ఆసుపత్రులలో టీకాలు వేయనున్నారు. ఒక్కో కేంద్రంలో గరిష్టంగా 200 మందికి టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో టీకాను ఉచితంగానే వేయనుండగా, ప్రైవేటు ఆసుపత్రులలో రూ. 250 వసూలు చేస్తారు. 
 
అంతకుమించి వసూలు చేయడానికి వీల్లేదని అధికారులు హెచ్చరించారు. సేవా రుసుము కింద వసూలు చేసే వంద రూపాయలను కూడా ఆసుపత్రులు పూర్తిగా మాఫీ చేయవచ్చని, లేదంటే కొంత తగ్గించి కూడా వసూలు చేసుకోవచ్చన్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments