Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విడుదలకు సిద్ధమైన "తెలంగాణ దేవుడు"

Advertiesment
విడుదలకు సిద్ధమైన
, శనివారం, 27 ఫిబ్రవరి 2021 (22:52 IST)
Telangana Devudu unit
"తెలంగాణ దేవుడు,‌ ఇది 1969 నుండి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో జరిగిన పరిస్థితులను చూసి ప్రజల కష్టాలను తీర్చిన ఒక ఉద్యమ ధీరుడి జీవిత చరిత్ర కథాంశం అంటున్నాడు దర్శకుడు వడత్యా హరీష్. హీరో శ్రీకాంత్, హీరోయిన్ సంగీత, జిషాన్ ఉస్మాన్ (తొలి పరిచయం), బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ ,మధుమితతో పాటు 50 మంది అగ్ర తారాగణంతో వడత్య హరీష్ దర్శకత్వంలో మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహముద్ జాకీర్ ఉస్మాన్ నిర్మిస్తున్న చిత్రం "తెలంగాణ దేవుడు". ఈ చిత్రం దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకొని గుమ్మడికాయ కార్యక్రమం జరుపుకుంది.
 
ఈ సందర్భంగా దర్శకుడు వడత్యా హరీష్ మాట్లాడుతూ, 1969 నుండి 2014 వరకు తెలంగాణలో ప్రజలు పడుతున్న కష్టాలను తీర్చడానికి ఒక ఉద్యమ ధీరుడుగా బయలుదేరి వారి కష్టాలను తీర్చిన ఉద్యమ ధీరుడి చరిత్రే  "తెలంగాణ దేవుడుష‌. ఈ చిత్రాన్ని ఎన్నో కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ జోడించి మంచి పాటలతో అన్ని రంగాల వారికి నచ్చే విధంగా చిత్రీకరించడం జరిగింది. నా మొదటి చిత్రంతోనే 50 మంది పెద్ద నటీనటులను డైరెక్షన్ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ధైర్యం ఇచ్చిన నిర్మాత మహముద్ జాకీర్ ఉస్మాన్కి నా కృతజ్ఞతలు. మార్చి చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు
 
మాక్స్ ల్యాబ్  సీఈవో ఇంతియాజ్ మాట్లాడుతూ .. తెలంగాణ ప్రాంతాలలో తెలంగాణ కోసం ఉద్యమం చేసి సాధించుకున్న తర్వాత ఏర్పడిన పరిణామాల గురించి ప్రస్పుటంగా ఈ చిత్రం ద్వారా తెలియజేయడం జరిగింది ఈ చిత్రంలో మహముద్ జాకీర్ ఉస్మాన్ గారి అబ్బాయి జిషాన్ ఉస్మాన్ ను పరిచయం చేస్తున్నాము. కొత్తవాడైనా అద్భుతంగా నటించాడు.అందరి సహకారంతో పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి మూడో వారంలో విడుదల చేస్తామని అన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విల‌న్ పాత్ర వ‌ల్లే సామ‌ర్థ్యం తెలుస్తుందిః లావణ్య త్రిపాఠి