Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నారప్ప' నుంచి 'గ్లిమ్స్ ఆఫ్ నారప్ప' .. అదరగొట్టిన వెంకటేష్

Advertiesment
'నారప్ప' నుంచి 'గ్లిమ్స్ ఆఫ్ నారప్ప' .. అదరగొట్టిన వెంకటేష్
, ఆదివారం, 13 డిశెంబరు 2020 (18:19 IST)
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం "నారప్ప". ఆయన పుట్టిన రోజు వేడుకను ఆదివారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తాజా చిత్రం 'నారప్ప' టీజరును విడుదల చేశారు. ఇందులో వెంకటేశ్ అద్భుతంగా కనిపిస్తున్నాడని అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ టీజర్ విడుదలైన గంటల వ్యవధిలోనే 1.7 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం గమనార్హం.
 
కాస్తంత నెరిసిన గుబురు గడ్డం, తలకు ఆకుపచ్చని తలపాగా, పంచెకట్టుతో కనిపిస్తున్న వెంకీ అందరినీ అలరిస్తున్నారు. కళ్లల్లో రౌద్రాన్ని చూపుతున్న నారప్ప స్టయిల్, ఈ చిత్రంలో అతని పాత్ర ఎలా ఉంటుందన్న విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఈ టీజర్ చూసిన వారంతా వెంకీ చూపిన హావభావాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీజర్ ను మీరూ చూసేయండి.
 
కాగా, గత యేడాది వెంకటేష్ 'ఎఫ్‌2', 'వెంకీమామ' వంటి వరుస విజయాలత దూసుకెళ్లారు. ఇపుడు ఆయన నటిస్తున్న నారప్ప చిత్రం నుంచి 'గ్లిమ్స్‌ ఆఫ్ నార‌ప్ప' పేరుతో ఈ టీజ‌ర్ను విడుదల చేశారు. 
 
మూవీలోని యాక్షన్ ఎపిసోడ్స్‌ని మాత్ర‌మే హైలైట్ చేస్తూ వచ్చిన ఈ గ్లిమ్స్‌.. సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది‌. ఈ టీజ‌ర్‌ వెంక‌టేష్‌లోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. 
 
ముఖ్యంగా చెట్టుచాటు నుండి క‌త్తి ప‌ట్టుకుని న‌డుచుకుంటూ వ‌స్తూ రౌద్రం పలికించిన తీరు అభిమానుల్ని ఉర్రూత‌లూగిస్తోంది. వెంక‌టేష్ సరికొత్త గెటప్, బాడీ లాంగ్వేజ్‌తో చాలా కాలం తర్వాత మాంచి మాస్ క్యారెక్టర్‌తో ప్రేక్షకాభిమానులను అలరించనున్నారని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. 
 
ఇక మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజ‌ర్‌ని మ‌రింత ఎలివేట్ చేసింద‌న‌డంలో సందేహంలేదు. ఈ టీజ‌ర్‌తో సినిమాపై అంచ‌నాల‌ను భారీగా పెంచింది చిత్ర యూనిట్‌. ప్రస్తుతం ఈ చిత్రం అనంత‌పురం షెడ్యూల్‌తో 80 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. తదుపరి షెడ్యూల్‌లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ని 
 
కాగా, ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఆహ్లాదకరమైన చిత్రాలు రూపొందించే డైరెక్టర్‌గా పేరున్న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న భారీ చిత్ర‌మిది. 
 
ఈ మూవీలో నార‌ప్ప స‌తీమ‌ణి సుంద‌ర‌మ్మ‌గా జాతీయ ఉత్తమ నటి ప్రియమణి న‌టిస్తోంది. 'నార‌ప్ప' పెద్ద కొడుకు మునిక‌‌న్నాగా 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ కార్తిక్ ర‌త్నం న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం 'గ్లిమ్స్‌ ఆఫ్ నార‌ప్ప' యూట్యూబ్‌లో నెం.1లో ట్రెండ్ అవుతోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కోలుకున్న బాలీవుడ్ నటి.. ఆపై పక్షవాతం...