Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఫామ్ హౌజ్ వద్ద అడుగుపెడితే ఆరు ముక్కలు అయితవ్ బిడ్డా....

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (09:10 IST)
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్‌ను ట్రాక్టర్‌తో దున్నేస్తానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. 
 
"నా ఫామ్ హౌజ్ వ‌ద్ద అడుగుపెడితే ఆరు ముక్క‌లు అయిత‌వ్ బిడ్డా అంటూ హెచ్చరించారు. అది గెస్ట్ హౌజ్ కాదు.. అది ఫార్మ‌ర్ హౌజ్.. అన్ని లంగ మాట‌లు మాట్లాడుతావ్" అంటూ మండిపడ్డారు. 
 
దిక్కు మాలిన పాద‌యాత్ర చేసుకుంటూ.. కేసీఆర్ నీ ఫామ్ హౌజ్‌కు వ‌చ్చి దున్నుతా అంట‌డు. ఏం బండి సంజయ్ నువ్ పార్టీని నడపడం వదిలి ట్రాక్టర్ నడుపుతున్నావా.. నీవు ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ వా? అంటూ బండి సంజ‌య్‌కు సీఎం కేసీఆర్ చుర‌క‌లంటించారు.
 
వంద ఎక‌రాల్లో నేను, నా కొడుకు బాజ‌ప్తాగా వ్య‌వ‌సాయం చేసుకుంటున్నాం. మాకేం మ‌నీలాండ‌రింగ్‌లు, బొండ‌రింగ్‌లు లేవు. మాకేం కంపెనీలు లేవు.. దందాలు లేవు. మాకేం బిజినెస్‌లు లేవు. దొంగ వ్యాపారాల్లేవు. మీరు మ‌మ్మ‌ల్ని ఏం చేయ‌లేరు. మేం నిజాయితిగా ఉన్నాం.. నిఖార్సుగా ఉన్నాం. ఎవ‌రితోనైనా పోరాడుతాం. ఎవ‌రికీ భ‌య‌ప‌డం అంటూ బండిపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు.
 
ఈ రాష్ట్రం కోసం క‌ట్టిన ప్రాజెక్టుల్లో మా అత్త‌గారి పొలం, మా పొలంతో పాటు ఊర్ల‌న్నీ మునిగిపోయాయి. మేం దొంగ సొమ్ముతో బ‌త‌కం. అందుకే మేం దేనికి భ‌య‌ప‌డం. నా హ‌ద్దుల‌ను నిర్ణ‌యించ‌డానికి నీవు ఎవ‌రు? అంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు
 
ఇప్ప‌టికైనా మా ప్రాణం పోయే వ‌ర‌కు తెలంగాణ కోసం, రైతుల ప్ర‌యోజ‌నాల కోసం కొట్లాడుతాం. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనే వ‌ర‌కు పోరాడుతాం. మీరు వ‌డ్లు కొనం అంటే మీకు ఓటేయ్యాలా? వ‌ద్దా? అనేది ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకుంటారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments