నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (08:57 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎమ్మెల్యే కోటా కింద మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికోసం ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. 
 
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే అభ్యర్థుల నుంచి ఈ నెల 16 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. వీటిని 17వ తేదీన పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 22గా ఉంది. 
 
పోటీ ఉంటే ఈ నెల 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
 
కాగా, రాష్ట్రంలోని ఆకుల లలిత, మహ్మద్ ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల ఎమ్మెల్సీ పదవీకాలం ఈ ఏడాది జూన్ 3వ తేదీనే ముగిసింది. 
 
అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను ఈసీ వాయిదా వేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నవంబర్ లో ఎన్నికలు జరుగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments