Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం... పిల్లల వార్డులో మంటలు.. నలుగురి మృతి

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (08:46 IST)
మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కమలా నెహ్రూ ఆస్పత్రిలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఆస్పత్రిలోని చిన్నపిల్లల వార్డులో మంటలు చెలరేగి నలుగురు మృతి చెందారు. 
 
అగ్నిప్రమాద ఘటన జరిగిన సమయంలో వార్డులో 40 మంది చిన్నారులు ఉన్నారు. 36 మంది చిన్నారులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. 
 
రాష్ట్ర మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments