Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రజల అటెన్షన్ మార్చేందుకే కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్ : రఘునందన్ రావు

Advertiesment
BJP
, సోమవారం, 8 నవంబరు 2021 (10:43 IST)
కేంద్ర ప్రభుత్వంతో పాటు.. భారతీయ జనతా పార్టీపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎపుడు వ్యతిరేకత వచ్చినా ప్రజల అటెన్షన్ మార్చేందుకే బీజేపీతో పాటు.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సీఎం కేసీఆర్‌కు ఓ ఫ్యాషన అయిపోయిందన్నారు. గత ఏడు సంవత్సరాలలో సీఎం కేసీఆర్‌కు ఎప్పుడు కోపం, ఆవేదన వచ్చినా బీజేపీపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితం తర్వాత సీఎం కేసీఆర్ తీవ్ర అసహనంలో ఉన్నట్లు అర్థం అవుతోందన్నారు. బీజేపీని ఎదుర్కోవడం కష్టం అని ఇంటిజెన్స్ రిపోర్ట్ వచ్చిందని, అందుకే కేసీఆర్ ఇలా ప్రస్టేషన్‌కు గురై మాట్లాడుతున్నారని విమర్శించారు. 
 
కేంద్రం ఎక్కడా వరి ధాన్యాలు కొనం అని చెప్పలేదని, కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే కొనం అని చెప్పారని వివరించారు. నచ్చితే ఒకరకంగా, నచ్చక పోతే ఇంకో రకంగా మాట్లాడం సరికాదన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తే అడగండి, నిలదీయండి దాన్ని స్వాగతిస్తాం’  అంతేకానీ ఇష్టానుసారంగా విమర్శలు గుప్పిస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 
 
ఎవరు తప్పు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పని రఘునందన్ రావు ఉద్ఘాటించారు. చాలామంది ముఖ్యమంత్రులు తప్పు చేసినప్పుడు అరెస్ట్ అయ్యారని గుర్తు చేశారు. తప్పు చేస్తే కేంద్రం అరెస్ట్ చేస్తుందని మాత్రమే బండి సంజయ్ అన్నారన్నారు. ఢిల్లీకి వెళ్లినప్పుడు వేరే పనిచేసుకోవడం, ఇక్కడ మాత్రం తమతో గొడవ పెట్టుకోవడం సరికాదన్నారు. 
 
పెట్రోల్ ధరలను మిగతా రాష్ట్రాలు కూడా ధరలు పెంచలేదుకదా? వాళ్లు తగ్గించినప్పుడు మీరు ఎందుకు తగ్గించరు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని రఘునందన్ రావు సూటిగా ప్రశ్నించారు. పెంచిన ధరలలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రాలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశం తరువాత భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని రఘునందన్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

14న తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల భేటీ