Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాలీబాల్ ఆడుతూ యువకులను ఉత్సాహపరుస్తూ బిజీబిజీగా రోజా

వాలీబాల్ ఆడుతూ యువకులను ఉత్సాహపరుస్తూ బిజీబిజీగా రోజా
, శనివారం, 6 నవంబరు 2021 (20:48 IST)
రోజా అంటేనే ఫైర్ బ్రాండ్. ఆమె ఏది చేసినా చర్చకు దారి తీస్తుంటుంది. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ వార్తల్లో నిలిచే రోజా మళ్ళీ తానేంటో నిరూపించుకున్నారు. క్రీడలపై తనకున్న మక్కువను మరోసారి చూపించారు రోజా. ఆసుపత్రుల్లో ఆంబులెన్స్ నడుపుతూ, చిన్నపిల్లలను ఆడిపించుకుంటూ, క్రికెట్, కబడ్డీ ఆడుతూ ఇలా ఒక్కోరకంగా కనిపించే రోజా ఈరోజు వాలీబాల్ ఆడారు.

 
తన సొంత నియోజకవర్గంలో నగరిలో రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రామీణ క్రీడా సంబరాలను తిలకించారు రోజా. అంతేకాదు యువకులతో కలిసి ఆమె కాసేపు వాలీబాల్ ఆడారు. బాల్‌ను గట్టిగా కొడుతూ కనిపించారు రోజా.

 
ఎంతో ఆసక్తికరంగా గేమ్ సాగింది. యువకులతో ఏమాత్రం తీసిపోకుండా సరిసమానంగా వాలీబాల్ ఆడారు. క్రీడల ఆవశ్యతలను ఈ సంధర్భంగా రోజా తెలిపారు. యువత ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా క్రీడలు తప్పనిసరి అని, విద్యతో పాటు కాసేపు క్రీడలపై కూడా విద్యార్థులు ఆసక్తి చూపించాలన్నారు. 

 
ఒకవైపు ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు మరోవైపు తన ట్రస్టు ఆధ్వర్యంలో యువతను ప్రోత్సహిస్తూ పలు క్రీడాపోటీలను నిర్వహిస్తున్నట్లు రోజా చెప్పారు. క్రీడలపై ఆసక్తి ఉండి స్థోమత లేని విద్యార్థులు తనను సంప్రదిస్తే ట్రస్టు ద్వారా వారికి ఆర్ధిక సహాయం అందజేస్తానన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశాభివృద్దిలో విద్యదే కీలక భూమిక: ఏపీ గవర్నర్