Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2023లో భాజపాదే అధికారం: ఈటల

2023లో భాజపాదే అధికారం: ఈటల
, శనివారం, 6 నవంబరు 2021 (21:13 IST)
హుజూరాబాద్‌ భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తెలంగాణ ఆత్మగౌరవ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. శంకర్‌పల్లి నుంచి భారీ వాహనాలతో ర్యాలీగా హైదరాబాద్‌ గన్‌పార్క్‌ వద్దకు చేరుకున్నారు. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఈటలతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ, మాజీ ఎంపీ వివేక్‌ తదితరులు నివాళులర్పించారు.

అనంతరం అక్కడి నుంచి నాంపల్లిలోని భాజపా కార్యాలయానికి ప్రదర్శనగా చేరుకున్నారు. హుజూరాబాద్‌ విజయం తర్వాత తొలిసారి భాజపా కార్యాలయానికి విచ్చేసిన ఈటలకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ..''కేసీఆర్‌ ఇచ్చే తాయిలాలకు ఆశపడి ఇక్కడి ఎన్నికల కమిషన్ అధికారులు, పోలీసులు పనిచేశారు. అధికార యంత్రాంగం అంతా సీఎం కేసీఆర్‌ ఒత్తిడికి లొంగి పనిచేసింది. సీఐలు, ఎస్సైలు స్థానిక నాయకులను బెదిరించారు. డీజీపీ గారూ.. పోలీసులు బెదిరించిన ఆడియోలు నా దగ్గర ఉన్నాయి.

తెరాస కండువా కప్పుకుంటే పనులవుతాయని పోలీసులు బెదిరించారు. ఒక్క ఉప ఎన్నికలో రూ.500 కోట్లు ఖర్చు పెట్టారు.. ఎక్కడి నుంచి వచ్చాయి. కేసీఆర్‌ నాయకత్వంలో అరిష్టమైన పాలన సాగుతోంది. 2023లో ప్రజలు తెరాసను పాతరేసి భాజపాను గెలిపిస్తారు'' అని ఈటల రాజేందర్‌ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీ కపిలేశ్వరాలయంలో విశేష‌పూజ హోమ మ‌హోత్స‌వాలు ప్రారంభం