Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఆర్ఎస్‌గా అవతరించిన తెరాస.. ఏపీలో పోస్టర్లు - హోర్డింగులు

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2022 (16:45 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పార్టీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భారాస ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పోస్టర్లు, హోర్డింగులు వెలిశాయి. 
 
విజయవాడలోని వారధి ప్రాంతంలో భారాస పార్టీ ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ హోర్డింగ్‌లు ఏర్పాటుచేశారు. భారాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్ పేరిట వారధి సెంటర్ వద్ద భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. 
 
హోర్డింగ్‌పై జయహో కేసీఆర్ అంటూ ఆయన చిత్రంతో పాటు కేటీఆర్ చిత్రాలను ముద్రించారు. వారధి సెంటర్‌తో పాటు నగరంలోని వేర్వేరు చోట్ల పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఏపీలోనూ భారాస హోర్డింగ్‌లు ఏర్పాటు కావడంపై  వాహనదారులు, పాదచారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments