Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీఆర్ఎస్ ఆవిర్భావ ప్రకటన సభ - 283 మందికి ఆహ్వానం

Advertiesment
Breakfast Serve
, బుధవారం, 5 అక్టోబరు 2022 (12:29 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇపుడు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా ఆవిర్భవించనుంది. ఇందుకోసం తెరాస సర్వసభ్య సమావేశం జరనుంది. ఈ సమావేశానికి దేశం నలుమూలల నుంచి 283 మంది ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇలాంటి వారిలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి, తమిళనాడులోని డీపీఐ నేత తోల్ తిరుమావలవన్ తదితరులు ఉన్నారు. 
 
హైదరాబాద్ నగరంలో ఉన్న తెరాస ప్రధాన కార్యాలయం ఇందుకు వేదికకానుంది. తెరాస చీఫ్ కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో తెరాస పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతుంది. సర్వసభయ సమావేశానికి మొత్తం 283 మంది ప్రతినిధులను ఆహ్వానించారు. సమావేశంలో పార్టీ పేరు మార్పుపై తీర్మానం, సంతకాల సేకరణ చేపడుతారు. ఆ తర్వాత తెరాస భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా ప్రకటన చేస్తారు. 
 
ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుమాళవన్ హాజ‌ర‌వుతారు. ఈ ఇద్ద‌రు నేత‌లు ఇప్ప‌టికే హైద‌రాబాద్ చేరుకున్నారు. బుధవారం ఉద‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌తో స‌మావేశమయ్యారు. 
 
కుమార‌స్వామితో పాటు పలువురు జేడీయూ ఎమ్మెల్యేలు ఆయ‌న వెంట వ‌చ్చారు. తిరుమాళవన్‌ ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి ప్రగతి భవన్‌కు వచ్చారు. వీరితో క‌లిసి సీఎం కేసీఆర్ అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా అతిథులకు సీఎం కేసీఆర్ స్వయంగా అల్పాహారం వడ్డించారు. మ‌రోవైపు జాతీయ పార్టీ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో తెలంగాణ నలుమూలల నుంచి టీఆర్‌ఎస్‌ నేతలు భారీ సంఖ్య‌లో నగరానికి చేరుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే : విప్రో ఆదేశాలు