Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనసూయను ఆటాడుకుంటున్న నెటిజన్లు - కౌంటరిచ్చిన బుల్లితెర హాట యాంకర్

anasuya
, శనివారం, 20 ఆగస్టు 2022 (08:57 IST)
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయను కొందరు నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో మైనర్ బాలికపై కొందరు యువకులు కారులో అత్యాచారం జరిగినపుడు స్పందించిన అనసూయ ఇపుడు ఎందుకు స్పందిస్తున్నారంటూ వారు ప్రశ్నించారు. 
 
ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గుజరాత్‌కు చెందిన బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచార కేసులో దోషులను ప్రభుత్వం విడుదల చేసింది. జైలు నుంచి విడుదలైన తర్వాత వీరిని ఓ సంస్థ సన్మానం చేసింది. ఇది దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. 
 
'మన దేశానికి ఇదొక మచ్చ. దోషులను తీసుకొచ్చి పూల మాలలు వేసి సన్మానం చేయడానికి వాళ్లేమైనా స్వాతంత్ర సమరయోధులా, యుద్ధ వీరులా'. ఈరోజు బిల్కిస్‌ బానో.. రేపు ఇంకొకరు కావొచ్చు. ఇప్పుడైనా గళం విప్పండి' అని ట్వీట్ చేశారు. 
 
ఈ ట్వీట్‌ను బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్‌ రీట్వీట్‌ చేసింది. "ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని మనం పునర్నిర్వచిస్తున్నట్లు అనిపిస్తోంది. రేపిస్ట్‌లను వదిలేసి.. మహిళల్ని తలుపు వెనుక దాచేస్తున్నాం" అని రాసుకొచ్చారు. 
 
దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. అనసూయపై విమర్శల వర్షం కురిపించారు. 'హైదరాబాద్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగినప్పుడు మాట్లాడని మీరు ఇప్పుడెలా మాట్లాడుతున్నారు' కామెంట్స్ చేస్తున్నారు. వీరికి అనసూయ ధీటుగానే సమాధానమిస్తున్నారు. 
 
'నేను ఏ ట్వీట్‌ చేసినా అది నా అభిరుచి, ఇష్టపూర్వకంగానే జరుగుతాయి. ఒక వ్యక్తినో, సంస్థ, సిద్థాంతాలనో ప్రచారం చేయడానికి కాదు. డబ్బు కోసం అంతకన్నా కాదు. ఒక విషయం మీద పూర్తిగా అవగాహన, సమాచారం ఉంటేనే నేను మాట్లాడతాను. నన్ను మాట్లాడమని కోరినా అవగాహన లేకపోతే వదిలేస్తాను. దాని జోలికి వెళ్లను. ఒకవేళ మాట్లాడితే తప్పుగా అర్థం చేసుకుని నన్ను టార్గెట్‌ చేస్తున్నారు. అందుకే నా సొంత నిర్ణయానికి రాలేకపోతున్నా. కాబట్టి నా ట్వీట్లపై రాజకీయం చేయవద్దు ప్లీజ్‌' అని అనసూయ ట్విట్టర్‌ వేదికగా కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత